Saturday, July 24, 2010

నీవు మహా ఆనంద సంతోషంగా

నీవు మహా ఆనంద సంతోషంగా ఉన్నప్పుడు
కొన్ని వేల లక్షల కోట్ల మైళ్ళ దూరం నుండి
దుఖ్ఖాల సాగరం నిన్ను ముంచేయడానికి వస్తుందేమో
సుఖంలో అజ్ఞాన స్పృహ లేక విజ్ఞాన ఎరుకతో ఉంటే
సాగరమైనా నీ మేధస్సులో అణువుగా చేరిపోతుంది
ఆత్మ ఎరుకతో జీవిస్తున్నంతవరకు అంతా తెలియునని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment