ఆత్మ భావాలతో విశ్వ ప్రయాణాన్ని ఆకాశాన సాగిస్తున్నా
స్వర్గాన్ని దాటి గ్రహాల అంచున నక్షత్ర కాంతిలో వెళ్ళుతున్నా
మనస్సు శూన్యమయ్యే వరకు విశ్వ విజ్ఞానం తెలుసుకుంటున్నా
నేను మరణించిన స్థానమే శూన్యముగా విశ్వమునకు కేంద్ర బిందువు
శూన్య కేంద్రమున భావాలు లేక ఆత్మ పరిశుద్దమైనది
ఆత్మ పరిశుద్దము కావాలంటే విశ్వ ప్రయాణమునకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment