Friday, July 16, 2010

సోమరితనం వలనే మనిషి డబ్బును

సోమరితనం వలనే మనిషి డబ్బును సృష్టించాడు
ఒక మనిషితో పని చేయించుకోడానికి పారితోషికం ఇవ్వాలి
డబ్బు లేనిదే ఎవరూ పని చేయని విధంగా ఎదుగుతున్నారు
ఆనాడు వస్తు మార్పిడితో మొదలై నేడు కోట్ల పారితోషికం వరకు
నేటికి డబ్బే ప్రధానమైన నిత్య అవసర అంశంగా మారినది
ధనం లేకపోతే ఆహారంతో పాటు మన భావాలకు ఏవి దక్కనట్లేనా
ధనం ఉంటేనే కొందరు మాట్లాడిస్తున్నారు అలాగే గౌరవాన్నిస్తున్నారు
ధనం కోసమే రోజులు శ్రమిస్తూ గడుస్తున్నాయి అలాగే అవసరాలు ఎక్కువైనాయి
ధనంతో కోరికలు పెరగడమే కాక మోసాలు కూడా పెరుగుతున్నాయి
సమాజంలో సరైన స్థితి లేకపోవడానికి డబ్బు కూడా ముఖ్య కారణమే
డబ్బులేని విధానాన్ని మరల తీసుకురావాలంటే ప్రతి ఒక్కరు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment