ఆత్మలోనే సకల విశేషణములు కలవని తెలుసుకో
శ్వాస మనస్సు భావం స్వభావం తత్త్వం దైవం
గుణం ప్రవర్తన ఆలోచన దయా కరుణా విశ్వశక్తి
పైన తెలిపినవి మానవ ఆత్మ సంబంధమైనవి
ఇతర జీవులలో ఆలోచన ఉండదని తెలుస్తుంది
ఇతర జీవులన్నీ భావాలతోనే జీవిస్తాయని నేను
ఆలోచనతో ఆత్మను గుర్తించినది మానవుడే
ఆలోచనతో విజ్ఞాన మేధస్సును వృద్ధి పరచుకున్నాడు
ఆలోచనతో అంతరిక్ష ప్రయాణము వరకు మానవ మేధస్సే
ప్రాపాంచికము నుండి ఆధ్యాత్మ వరకు సూక్ష్మ మహా కార్య ప్రజ్ఞానం
ఆలోచనతోనే మేధస్సున ఆత్మ విశ్వ విజ్ఞానం చెందవచ్చని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment