విశ్వమే నాలో జీవిస్తుందని ఎవరికి ఎలా తెలుపాలో కాలమే నిర్ణయిస్తుందా
నా భావాలను అర్థం చేసుకునే వారు లేకనే ఇంకా తెలియని నా జీవితము
ఆత్మ జ్ఞానం లేక విశ్వ విజ్ఞానం లేక ఎందరికో నా భావాలు అర్థం కానున్నవి
నా జీవితాన్ని నిర్ణయించేదెవరో కాలానికి కూడా తెలియకపోతే నా జన్మే వృధా
విశ్వ విధానాన్ని సరైన రీతిలో మార్చాలనుకున్న నా మహా ఆలోచన వ్యర్థమా
నా విశ్వ విజ్ఞాన ఆత్మ మేధస్సు శూన్యమైతే పరమాత్మలో ఐక్యమై పోతాను
మరల రాలేను విశ్వ ప్రపంచాన్ని చూడలేను మర్మముగా మరో లోకాన ఉంటా
మీ జీవితం కన్నా మీలోని మహా ఆశయాన్ని విశ్వానికి అందించలేకపోతే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment