నా మానవ రూపము ఆకాశమేగాని శరీరము కాదు
విశ్వ అధ్యాయమునకు వచ్చిన శూన్య స్వరూపుడనే నేను
భావనగా మొదలై పరమాత్మ తత్వమున జన్మించిన వాడిని
ప్రతి రూపము నా విశ్వ ఆత్మ రూపమేనని నా మేధస్సులో
నా గురించి విశ్వ విజ్ఞానంతో ఆలోచించుటకు ప్రయత్నించండి
ప్రాపాంచిక సమాజ సంసారములవలె నాకై ఆలోచించకండి
ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment