ఆత్మతో జన్మిస్తున్నపటి నుండి ప్రపంచ కార్యాలతో సాగుతూనే ఉన్నావు
జీవిత జీవన కార్యాలతోనే సమాజమున అందరిలా జీవిస్తూనే ఉన్నావు
నీ సమస్యలుగాని సమాజ సమస్యలుగాని తీరక ఎన్నో మిగిలిపోయాయి
నీవు అనుకున్నది సాధించలేదు సమాజాన్ని మార్చలేక పోతున్నావు
నీకంటూ ఓ గుర్తింపు సమాజమున కలగలేదు ఆ కార్యాన్ని చేయలేదు
ఓర్పు సహనం చైతన్యంతో కూడిన మహా శాంతి కార్యాలను చేయనేలేదు
నీవు మారలేదు సమాజ ప్రపంచాన్ని మార్చలేదు కుటుంబము అలాగే
ఎదుటివారికన్నా గొప్పగా ఎదగాలని ఉన్నా ఇంకా ఎంతో ఎదగాలని ఆశ
ప్రపంచ జీవితంలో ఎంత ఎదిగినా నీకన్నా గొప్పవారు ఎందరో ఉంటారు
విశ్వ కార్యములతో మహా కార్యాన్ని చేపట్టి విశ్వ విధాతగా ఎదగాలి
విశ్వ కార్యమునకు ఆత్మ జ్ఞానం మహా ఆలోచన దీక్ష సాధన అవసరం
అన్ని మార్పులకు దివ్య జ్ఞాన ఆనందానికి కావలసిన స్పూర్తి ఆత్మ చైతన్యమే
నీ విజ్ఞానాన్ని ఆత్మ జ్ఞానంతో ఆలోచిస్తే నీ మేధస్సులో మహా ఆలోచనలే
విశ్వ కార్యాలను చేసేందుకు ఆత్మను శ్వాస గమనంతో మేల్కొల్పేందుకు
ధ్యాన సాధనయేనని నేటి నుండి వయసును మరచి ఉత్తేజముతో
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment