ఒక జన్మ జీవితం చాలు దేనికైనా ఎంతటి దానికైనా
నీ ఆశయాలను నెరవేర్చుకొనుటకు అవకాశం రాకపోయినా
నీ ఆశయాలను ఎవరైనా అధిగమించినా నీ వారేనని భావించు
నీకెప్పుడైతే అవకాశం వస్తుందో ఆనాడు నీ ఆశయాన్ని నెరవేర్చుకో
కొన్ని ఆశయాలను నీవు ఎన్ని జన్మలకు అధిగమించలేక పోతావనుకుంటే
అలాంటి వాటికై నీవు ఓ విశ్వ భావనను మహా గొప్పగా మేధస్సున గ్రహించాలి
విశ్వము నాదే నాలో ఉన్నది విశ్వమే ఇక నా ఆశయాలకై ఓ విశ్వ భావన చాలు
మరో జన్మ నాకై ఉన్నా గత ఆశయాలకై అవసరం లేదనే నా ఆత్మ భావన తెలుపుతుంది -
ఎన్నో ఆశయాలతో జీవించే మనము అన్నింటిని ఒకే జన్మలో నేరవేర్చుకోలేము
మళ్ళీ జన్మించి మళ్ళీ విద్యను నేర్చి అనుభవంతో శ్రమిస్తూనే ఎన్నో అధిగమించాలి
మాయగా తీరని ఆశల ఆశయాలకు మరోజన్మ అవసరంలేదని కార్య కారణమును తెలుసుకున్నా -
జీవించే జీవన విధానము తెలిసిన మనకు మరో జన్మ ఎందుకని నే తెలుపుతున్నా -
ఈ జన్మలోనే విశ్వ విజ్ఞానమును తెలుసుకుంటే మన జీవితము సంపూర్ణమవుతుందని -
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment