విశ్వము నేదేనని జీవిస్తే విశ్వ రూపములన్నీ నీవే
నక్షత్రమైనా సూర్య కిరణమైనా ఇంద్ర ధనస్సైనా నీదే
విశ్వ కాల ప్రభావము తప్ప అన్నీ నీవేనని నీలో నీతో
విశ్వ రూపాలను నీవు తిలకించుటలో కలిగే భావాలు
మరలా విశ్వ రూపాలు నిన్ను గ్రహించి నీ రూపాలేనని
తెలుపుతున్నా నీవు గమనించ లేనందున తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment