శ్వాసలోనే సంతృప్తి కలుగుతుందని శ్వాసనే గమనించు
శ్వాస గమనంతో ఏకాగ్రత ఏర్పడి ప్రశాంతత కలుగుతుంది
ప్రశాంతతో ఆరోగ్యం అధికమై శరీరం తేజోదయమవుతుంది
ఆరోగ్య శ్వాసతో మేధస్సు విజ్ఞానవంతమై ఉత్తేజమవుతుంది
ఉత్తేజము నుండి కలిగే ఆలోచనలు ఆత్మను స్పర్శిస్తాయి
ఆత్మను విజ్ఞాన పరచుటకు ధ్యాన సాధన అవసరం
శ్వాస ధ్యానముతోనే మహా సంతృప్తి ఆత్మకూ కలుగుతుంది
ఆత్మ సంతృప్తితో శూన్య చైతన్యాన్ని పొందుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment