Saturday, July 24, 2010

నేను ఈ క్షణం ఇక్కడ మీతో ఉన్నా

నేను ఈ క్షణం ఇక్కడ మీతో ఉన్నా
ఇదే క్షణాన మరో ప్రాంతాన మరో చోట కూడా నేను ఉంటా
ఎన్నో ప్రాంతాలలో ఎన్నో విధాల నేనే ఉన్నా
విజ్ఞాన విశ్వ భావాలు ఎక్కడైతే వికసిస్తుంటాయో
ఆ ప్రాంతాలలో నేనే విశ్వ రూపాలతో ఉంటా
నా శరీరాత్మలో ఎన్నో విశ్వ రూపాత్మలు దాగి ఉన్నాయి
మీలో ఉన్న విశ్వ రూపాత్మలను తెలుసుకోవాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment