Saturday, July 17, 2010

విశ్వమును గూర్చి ఏమని

విశ్వమును గూర్చి ఏమని వివరించెదను ఎలా వర్ణించెదను
ఆకాశమా అంతరిక్షమా అనంత భావాల స్వభావ తత్వమా
రూప పరిణామాల వర్ణాలలో మహా అద్భుత ఆశ్చర్యములు
సూర్య చంద్రుల నక్షత్ర కాంతులు కిరణాల ప్రకాశ తేజములు
ప్రతి అణువులో గుణ విశిష్ట విశేషణ స్వభావాలు వివిధములే
ప్రతి జీవి ఆకారరూపము వేరు జీవన ప్రవర్తన మేధస్సు వేరు
ప్రకృతి కాల ఉనికిలో ఎన్నో భ్రమణ మార్పుల ఎదుగుదలలు
కాలం సాగుతున్నా కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి
అన్ని విషయాలు అనుభవ పూర్వకంగా మనలో కలుగుటకు
మేధస్సు దివ్యంగా జ్ఞానోదయం చెందాలని విశ్వ విజ్ఞానముకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment