విశ్వమున నీవు ఎక్కడ ఉన్నా అద్భుత విజ్ఞానం తెలియాలంటే
ఓ అద్భుతాన్ని తిలకించే సమయాన ఓ ఆలోచనను గ్రహించు
ఇలాంటి అద్భుతాలు ఎన్నైనా నా మేధస్సులో చేరుతూనే ఉంటాయి
అద్భుతాలకు కృషి ధీక్ష రహస్య ఆలోచనలు నా భావాలే
నా నుండి వెళ్ళే తరంగాలు ఇతరులకు అద్భుత ఆలోచనలు
ఆలోచనల రూప కల్పన సాధనతో నిర్మించినవే అద్భుతాలు
మేధస్సు నుండి వెళ్ళిన ఆలోచనలు మరల నాలో అద్భుతాలుగా
అద్భుత విజ్ఞానం నాలో చేరుతున్నట్లు మీలో కలిగేందుకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment