Friday, July 30, 2010

విశ్వమున పగటి మేఘాలతో

విశ్వమున పగటి మేఘాలతో సూర్యుడు కనిపించకపోయినా
నా మేధస్సులో సూర్యుని తేజ కిరణము ప్రకాశిస్తూ ఉండాలని
సూర్యోదయము నా మేధస్సులో నిత్యం కలుగుతూనే ఉన్నది
నా మేధస్సున సూర్య తేజము లేకపోతే అనారోగ్యంతో ఉంటా
ఏనాటికీ నాలో సూర్య భావన కలగకపోతే నే అస్తమించేనట్లే
విశ్వమున నేను లేని క్షణం మేఘాలతోనే ఉంటుందని నిదర్శనం
నిత్యమూ ఉత్తేజమునకై మేధస్సులో దివ్యాలోచన ఉండాలని
ఆత్మ జ్ఞానం చెందవా నీలోని శ్వాసే నీకు విశ్వ శక్తిగా ఉన్నది
విశ్వము నీలోనే ఉందని శ్వాసను నిత్యమూ గమనించు విశ్వమా!

No comments:

Post a Comment