విశ్వమే నీదని నే తెలుపుతున్నా గ్రహించని ఆలోచనగా నీ మేధస్సున
శ్వాసలో గమనించినా విశ్వమే నీదని నీకు ఆత్మయే తెలుపుతున్నది
విశ్వంలో కూర్చొని ధ్యానించమని ఆత్మ భావాలే నీకు తెలుపుతున్నాయి
ఏనాడైనా గ్రహించినావా విశ్వమే నీ శ్వాసలో ధ్యానిస్తూ జీవిస్తున్నది
ఆత్మయే విశ్వమని నీకు తెలియుటకే విశ్వ విజ్ఞానాన్ని గ్రహించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment