Sunday, July 18, 2010

కాలం ఎప్పటికీ అజ్ఞానాన్ని

కాలం ఎప్పటికీ అజ్ఞానాన్ని సూచిస్తుందనే మేధస్సు గ్రహించాలి
క్షణ సమయంలో కూడా సూక్ష్మ అజ్ఞానాన్ని కలిగిస్తుంది
మేధస్సు ఏకాగ్రతతో గమనిస్తే తక్షణమే తెలుస్తుంది
కొన్ని తప్పులు చేసిన కొంత కాలానికి తెలుస్తాయి
మనకు తెలియని అజ్ఞాన సూక్ష్మ కార్యాలు మన మహా కార్యాలలో ఎన్నో జరుగుతాయి -
సూక్ష్మ కార్యాలను కూడా విజ్ఞానంగా ఏకాగ్రతతో చేస్తే
సంపూర్ణ కార్యాన్ని నిర్వర్తించినట్లు గొప్ప భావన కలుగుతుంది
మనస్సు యొక్క ఆలోచన లోప ప్రభావమే అజ్ఞానానికి కారణం
దీర్ఘ కాల ఏకాగ్రత మనలో ధృడంగా లేక అజ్ఞానానికి దారితీస్తుంది
మన గుణ భావ ప్రవర్తనలో ఓర్పు లేకపోయినా అజ్ఞానం కలుగుతుంది
కార్య కారణ విధానాన్ని తెలుసుకుంటే కార్యాలు విజ్ఞానంగా సాగుతాయి
కార్య కారణమున కాలం కూడా వృధాకాక విజ్ఞానంగా కార్యాన్ని నిర్వర్థిస్తాం
మనం ఎలా ఉన్నా మనం చేసే కార్యాలు కార్య కారణంతో సాగాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment