Tuesday, July 20, 2010

పెళ్ళితో జీవన విధానమే కాక

పెళ్ళితో జీవన విధానమే కాక ఆశయాలు కూడా మారుతాయి
మహా గొప్ప ఆశయాలైతే పెళ్ళితో తీరకపోతే సమాజం సమస్యలతోనే
పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేకపోయినా వద్దని నిర్ణయించుకున్నా
తల్లిదండ్రులు బాధ్యతగా చేసుకోమనే ఎన్నో రకాలుగా తెలిపెదరు
నీ మేధస్సును వంచేలా నీ ఆలోచనలను మార్చేలా చేస్తారు
చివరికి పెళ్ళితో నీ ఆశయాలు నెరవేరక నీ వాళ్ళనూ మార్చలేక
ఇతరులకు నీవు మేలు చేయక సమాజము స్వార్థంగా తయారవుతుంది
ఓ మహా మనిషి ఆశయాలను తెలుసుకోలేని గుర్తించని వారెందరో
నేను తెలుపాలనుకున్నా వారి సిద్ధాంతాలే తెలుపుతారుగాని
నేను ఎందుకు వద్దంటానో నా జీవిత ఆశయాన్ని గుర్తించలేకపోతున్నారు
మీ భాధ్యతలకన్నా నా ఆశయాలు గొప్పవని తెలుసుకునేందుకు
ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!
నేను మరణిస్తే నా విశ్వ విజ్ఞాన ఆశయాలను ఎవరూ తెలుసుకోలేరు
రాబోయే వారి జీవితాలను ఎవరూ మార్చలేరు మీకైనా అవగాహన లేదు
సమస్యలను సముద్రంలో వేసినా కెరటాలుగా ఉప్పొంగి మహా సమస్యలవుతాయి
నా ఆలోచనలను మార్చడం కంటే మీ ఆలోచనలను పరీక్షించుకోండి
మీరు ఎలాగైనా జీవిస్తారు జీవించలేని వారిని జీవింప గలరా
కరుణ దయా గుణాల కన్నా ఆత్మ భావాలు నాకు ముఖ్యమైనవి
తెలుపుతూ పొతే విశ్వం ఆగుతుందేమోగాని నా ఆశయాలు మారవు
ఇప్పటికైనా ఆత్మ జ్ఞానం చెందావా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment