Friday, July 30, 2010

అనారోగ్యంతో కూడా మనిషిలో

అనారోగ్యంతో కూడా మనిషిలో ఓ విధమైన మహా మార్పు కలుగుతుందని భావిస్తున్నా -
కాల ప్రభావము మనకు దేనిని తెలుపుతుందో గ్రహించుటకు ఓ అవకాశమే అనారోగ్యం -
శరీరంలో మేధస్సుకు రోగం లేకపోతే ఏ రోగాన్నైనా వదిలించుకోవచ్చని నా దివ్య విజ్ఞానం -
మేధస్సులో లోపించినా మరో జీవి అతనికి ధ్యాన భావనను కలిగిస్తే మేధస్సు మహా వృక్షమే -
ధ్యాన భావన మహా రోగానికి దివ్య ఔషధంగా పని చేస్తుందని భవిష్య కాలమే తెలుపుతుంది -
సూక్ష్మ జ్ఞాన ధ్యాన భావ విశ్వ విజ్ఞాన ఆత్మ ఎరుక కలవారు రోగాన్ని అనుభవముగా స్వీకరిస్తారు -
ఆధ్యాత్మ మహాత్ములకు రోగములు విజ్ఞాన పాఠాలుగా మేధస్సున భోధనమవుతూ ఉంటాయి -
నేను నేర్చిన విజ్ఞాన పాఠాలు విశ్వమున కాల ప్రభావాలుగా క్షణానికి ఎన్నో ఆత్మకే ఎరుక -

No comments:

Post a Comment