Thursday, September 30, 2010

మనమంతా భారతీయులం ఐతే

మనమంతా భారతీయులం ఐతే మన దేశం సురక్షితమే
పర దేశీయులకైనా మన దేశం ఎప్పటికీ సురక్షితమే
చరిత్రను దేశ భవిష్య విజ్ఞానం కోసమే తెలుసుకోండి
ఆశించేది విశ్వానికే పరిపూర్ణ విజ్ఞానంగా ఉండాలి
మనిషిని మనిషిగా గౌరవిస్తూ సంతోషంగా జీవించండి
మనిషిలో మహాత్ముల మానవ లక్షణాలే ఉండాలి

Wednesday, September 29, 2010

కర్మ కోసమే జన్మ జన్మలుగా

కర్మ కోసమే జన్మ జన్మలుగా జన్మించి శ్రమించడం అజ్ఞానమేగా
ఒక్క జన్మలోనైనా ఆత్మ జ్ఞానంతో జీవించడం మానవుని లక్షణం
ఆత్మ జ్ఞానం పొందలేక కర్మతో జన్మ జన్మలుగా జీవిస్తున్నాము
నిత్యమూ శ్రమిస్తూ జీవించుటలో విజ్ఞానం లేకపోతే జన్మ వ్యర్థం
జన్మ జన్మలు వ్యర్థమైతే లోకంలో అందరూ అజ్ఞానంగానే జీవిస్తారు
కొన్ని వేల కోట్ల జన్మల జీవితాలలో ఆత్మ జ్ఞానం లేకపోతే ఎలా
ఎంతవరకు అజ్ఞానంతోనే జీవిస్తుంటే సత్యమే తెలియకుండాపోతుంది
సత్యాన్ని గ్రహించుటకైనా ఆత్మ కర్మను విజ్ఞానంతో నశింపజేయాలి
పూర్తిగా తెలుపాలంటే మీ మేధస్సుకు అర్థంగా ఓ గ్రంధమవుతుంది


Monday, September 27, 2010

నా జీవితము విశ్వ మార్గమున

నా జీవితము విశ్వ మార్గమున ప్రయాణించాలని జీవిస్తున్నా
నా మార్గము విశ్వ భాషతో సాగునని దివ్య భావనతో వేచియున్నా
రూపములేని ఆత్మ భాషకు నా స్వభావాలు విశ్వమున లీనమయ్యెను
మరణములేని పంచభూతాలుగా విశ్వమున పరమాత్మలో కలిసిపోయాను

ఏమి తోచని క్షణములలో

ఏమి తోచని క్షణములలో ఆలోచనలు ఏమని ఆలోచించును
ఏ ఆలోచనలు కలుగునో మేధస్సుకే అంతులేని సందేహము
సందేహాలకు విజ్ఞానమే అజ్ఞానమైతే మనస్సు ఎక్కడెక్కడికో
మనస్సుతోపాటు దేహము వెళ్ళిపోతే జీవితమే మారిపోవును

మరణానికి ముందే నా ఆత్మను

మరణానికి ముందే నా ఆత్మను నేనే చూసుకున్నాను
నా ఆత్మలోని సూక్ష్మ తేజాన్ని నాలోనే దాచుకున్నాను
నా ఆత్మ భావనలోని విశ్వ భాషనే నేను గమనించాను
విశ్వ భాషలో నా ఆత్మ పరమాత్మేనని నేనే గ్రహించాను

Friday, September 24, 2010

కనిపించని కాలానికి వెలుగు చీకటి

కనిపించని కాలానికి వెలుగు చీకటి భావాలే నిదర్శనం
కాలం సాగే ప్రతి క్షణానికి ఆకాశమే ప్రతి రూపము
సూర్య చంద్ర నక్షత్ర స్థానాలే వెలుగు చీకటి స్వభావాలు
మేఘ వర్ణ రూప కదలికలే కాల ప్రభావ సందేశాలు
జీవుల జీవితాలే కాల విజ్ఞాన జనన మరణ ప్రమాణాలు

విశ్వమున ప్రతి అద్భుత రూపాలలో

విశ్వమున ప్రతి అద్భుత రూపాలలో సూక్ష్మ భావాలతో ఒదిగి ఉన్నా
అద్భుతాన్ని తిలకించే మరో భావనను కూడా నేనై రూపములలో ఉన్నా
ఎవరికి లేని దివ్య భావనలు నా మేధస్సులో ఉన్నట్లు విశ్వ రూపాలలో
విశ్వ రూపాలలో ఉన్న భావాలన్నీ నా మేధస్సులో విశ్వ భాషతో ఉన్నాయి

నా మేధస్సులో కలిగే విశ్వాలోచనతో

నా మేధస్సులో కలిగే విశ్వాలోచనతో సూర్యోదయం కలుగుతున్నది
సూర్యోదయాన ఉదయించే విశ్వాలోచన నాలో ఆత్యంత ప్రధానమైనది
భావాలలో ఉత్తేజాన్ని కలిగించే మహా ఆలోచన శక్తి సూర్యునిలో ఉన్నది
సూర్యాస్త భావన కూడా నా మేధస్సులో విశ్వాలోచనగా కలుగుతుంది

మన జీవితంలో ఎన్నో సందర్భాలలో

మన జీవితంలో ఎన్నో సందర్భాలలో ఏమీ తోచదు
తోచని సమయాలలో ఏదేదో ఆలోచిస్తూ ఉంటాము
ఎంతో సమయాన్ని వృధా చేస్తూ కాలం గడిపేస్తాము
కొన్ని సందర్భాలలో మంచిగా ఆలోచించి ఉంటాము
ఖాళీ సమయాన్ని ఆత్మ జ్ఞానం కోసం ఉపయోగించండి
ఆత్మ జ్ఞానంతో జీవితాన్ని మహా విజ్ఞానంగా సాగించండి

శ్రీ గుణ

శ్రీ అనే అక్షరము ఓ గుణ విశేష పదముగా చాలా ప్రసిద్ధమైనది
ప్రతి నామమునకు ముందస్తుగా పవిత్ర భావంతో శ్రీ నిలిచి ఉంటుంది
ప్రత్యేకమైన కార్యాన్ని శ్రీ దివ్యత్వంతో ఆరంభిస్తూ కొనసాగిస్తాము
గుణాలన్నింటిలో శ్రేష్టమైన గుణము శ్రీ భావమే ప్రధానమైనది

Thursday, September 23, 2010

ప్రపంచ విజ్ఞానాన్ని గ్రహించినట్లు

ప్రపంచ విజ్ఞానాన్ని గ్రహించినట్లు నీ అంతరాత్మలో విశ్వ విజ్ఞానాన్ని చూసుకో
నీ ఆత్మ తెలిపే విశ్వ భాష భావ స్వభావాలను గ్రహించి ఆకాశాన్ని గమనించు
సర్వం నీ శ్వాసలో ఉన్నట్లు విశ్వం నీ మేధస్సున భవిష్యత్ ను చూపుతుంది
విశ్వ విజ్ఞానిగా ఎదిగే నీ మేధస్సును కాలంతో అంతరాత్మ లోకాన సాగించు
తెలిపేవారు లేరు తెలుసుకోవాలన్నా అర్థమయ్యే విజ్ఞాన కాలం తోచబోదు
సందేహాలకు నా దేహా ఆకాశాన్ని గమనిస్తూ జీవించు సమస్తం తెలియును

ముప్పై మూడు సంవత్సరాలు చాలులే

ముప్పై మూడు సంవత్సరాలు చాలులే నా జీవితానికి అనుభవం ఎంతో
నేను తెలుసుకున్న అనుభవ జీవితానికి లోక విజ్ఞానం ఎంతో తెలిసింది
విశ్వ భాష భావ స్వభావాలే నా జీవితానికి ఆత్మ జ్ఞాన విజ్ఞాన అనుభవం
ఆకాశమే నాకు ఎన్నో లోకాలను చూపుతూ విజ్ఞానాన్ని సమకూర్చింది
శూన్యం నుండి అనంత లోకాలను గ్రహిస్తూ భవిష్యత్ ను తిలకిస్తున్నాను

22 సెప్టెంబర్ 2010 అర్ధ రాత్రి వేళ

22 సెప్టెంబర్ 2010 అర్ధ రాత్రి వేళ నే చూశాను నా భావన లోకాన్ని
ఆకాశాన నిండు వెన్నెల పున్నమి చంద్రుడు కాంతి తత్వంతో మెరిసిపోతున్నాడు
చంద్రునికి రెండు గజాల దూరంలో దివ్యమైన నక్షత్రము తళతళమని మెరుస్తున్నది
తేట తెల్లని మేఘాలు కదిలిపోతుంటే నక్షత్ర చంద్రుల విహారయాత్ర సాగిపోతున్నది
చేపల చర్మము వలె ఉన్న మేఘాల కదలికలు భావన లోకాన్ని తెలుపుతున్నాయి
అద్భుతమైన ఆకాశంలో నా భావన లోకాన్ని మహా దివ్యత్వంతో దర్శించాను
ఇలాంటి ఆద్భుత లోకాలను ఆకాశంలో ఎన్నో చూశాను ఇంకా చూస్తాను

Wednesday, September 22, 2010

విశ్వమున నీవు ఎక్కడ నిలిచినా

విశ్వమున నీవు ఎక్కడ నిలిచినా మధ్యస్థమున ఉన్నట్లే తోచును
భూమిపైనగాని ఆకాశమునగాని సముద్రములోనైనా గాలిలోనైనా
అంతరిక్షమునగాని ఎక్కడైనా గాని నీకు నీవు మధ్యమున ఉన్నట్లే తోచును
విశ్వ నిర్మాణమున అంచులను చూడలేవు ఆ స్థానమున వెళ్ళలేవు
విశ్వ నిర్మాణము అద్భుత రూపకల్పనతో కూడిన మహా శాస్త్రీయ విధానము
ఎవరు ఎక్కడున్నా ఏది ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళిన మధ్యస్తమే

Permanent Solution

Why we can’t think for permanent solution –
For any creation we can’t follow/think the permanent solution –
Everyone thinks for money, no future utilization -
Sale of product for profit or getting commission within short time –
Even policies are also unplanned bias -
For Example:
Q: A person wants to Constructs house in his own area (Boundary of town)
A: He is meets civil engineer and plans the house, sanctions it in Municipality then he starts construction after few months he completes it and he lives in it.
After some years few house exist in that area.
There are no proper roads, trees, drainages, drinking water, electricity, hospital and security.
Now the government sanctions policies which are not good, because those facilities are inconvenient and there is no proper place.
It’s difficult to live in that area with so many problems, those are
1) No proper widen roads for vehicle’s to move and turn and also large vehicles can’t come inside.
2) No proper drainage, all drainage water comes on the road.
3) No health facility to take care, for hospital moving to long distance around 5 km’s.
4) There is no drinking water facility.
5) No cleanliness in the street.
6) No security, Different people with different attitudes theft, smoking, drinking and playing cards etc.,.
7) The area is not good for literate and illiterate people.
Procedure to live in an area:
Clean the area
Long width of roads with trees and greenery
Public services: hospital, schools, security
Drainages
Electricity
Drinking water
*After all these things are promoted then only license should be given to construct houses
-----
I have so many universal plans for permanent solution.
I think like event reason procedure with exact reach.
Voluntarily you can discuss with me for different plans, procedures, reasons, problems, and society issues.

Time is most important

Time is most important in life –
How the time is there even don’t know the born and death –
Why creates which thing still no guess –
Human mind knows the advantages but we don’t know the universal intent –
The universal intent meaning is there in feelings and characters –
How the time goes we are growing with knowledge –
In a life enlightenment is not there everything is effect by time –

Tuesday, September 21, 2010

Which thing you understand

Which thing you understand completely –
Which thing you know all intents and feelings –
Which thing having how much capacity of knowledge –
Which thing you know all properties and characters –
Which thing you know the exact life time –
If you want to know the universal knowledge, so many things you should learn -

What you learn it appears

What you learn it appears in your performance –
You can think how you spent the past seconds –
Past is ignorance, just try to learn the knowledge –
Past is Knowledge, still you learn minute things –
Unnecessarily don’t create problems to others by ignorance -

Life’s are can’t changes

Life’s are can’t changes, can’t mould and we shouldn’t guess with ignorance mind –
How we should live, why we are living, knowledge only difference for us and other persons –
How we’ll get a chance to improve the knowledge and how to control/keep the mind in active –
Which way we follow, how we cross the undulations through knowledge/intelligence –
Whose life cannot be changed, they must choose the way of universal intent as meditation –

You should know everything

You should know everything still every day something is there to learn –
Now the time goes with extra ordinary technology entire the universe –
How much you learn still there to learn for any person in the world –
In sea one atom of knowledge no one learn entire the life –
How much you learn you know everything then you do meditation –
From meditation you will get enlightenment in the mind and everything receives from universe –

Sunday, September 12, 2010

ఎంత విజ్ఞానం ఉన్నా ప్రతి రోజు ఇంకా

ఎంత విజ్ఞానం ఉన్నా ప్రతి రోజు ఇంకా నేర్చేది ఉందనిపిస్తుంది
నేటి కాలమున సాంకేతిక విజ్ఞానం చాల వేగంగా ప్రయాణిస్తున్నది
నేడు ఎంత నేర్చినా ఎంతటి వారైన నేర్చేది ఎంతో ఉన్నది
సముద్రంలో అణువంతయు కూడా ఇంకా ఎవరు నేర్చలేదు
ఎంత నేర్చినా అంతా తెలిసినట్లుగా జీవించాలంటే ధ్యాన సాధనయే
ధ్యానంతో ఆత్మ విజ్ఞానంతో సమస్తము భావాలతోనే మేధస్సున
విశ్వమున నిత్యమూ ప్రతీది గ్రహిస్తూనే నిలిచి ఉంటాము

తిరుమలలో ఉన్న సంపాదనతోనే

తిరుమలలో ఉన్న సంపాదనతోనే ప్రపంచాన్ని దివ్యంగా మార్చవచ్చు
నా మేధస్సుతో లెక్కించి చూసాను ఎన్ని వేల లక్షల కోట్ల పైసలతో సహా
నాలోనే లెక్కలు వ్రాసుకుంటున్నాను ఎవరెవరు ఎంత వేసి యున్నారో
వ్రాసేవారు మరచిపోయినా నా లెక్కలలో అక్షరంతో సహా ఖచ్చితమే
ఏ క్షణం ఎంత ఎవరు వేశారో పేర్లు చిరునామాతో సహా నా నేత్రాలలో
తిరుమల వెలిసినప్పటి నుండి ఇప్పటివరకు ఖర్చు ఆదాయం నాదే
విశ్వ కాల భావాలకు తెలిసినట్లే నా మేధస్సు స్వభావాలకు తోస్తున్నది
నా భావాలు విశ్వ లోకాన్ని దివ్య స్వభావాలతో తిలకిస్తూనే ఉంటాయి
ప్రతి జీవి ప్రతి ఆలయ ఆదాయ ఖర్చులు నా నుదిటిపై లిఖిస్తున్నారేమో
విశ్వ కార్యాలతో సహా సూక్ష్మంగా ప్రతీది నా నుదిటిపై భావాలతో ఉన్నది
లెక్కలు లేకపోతే ఎంతటి ఖజానా ఐనా ఖాళీ అవుతుందని నా అనుభవం

మనిషిలో భక్తి కన్నా విజ్ఞాన ప్రవర్తన

మనిషిలో భక్తి కన్నా విజ్ఞాన ప్రవర్తన చాలా అవసరం
భక్తి కొన్ని కార్యాలకు మాత్రమే ఉపయోగపడుతుంది
విజ్ఞానం ప్రతి కార్యానికి విశేషమైన మూల కారణ ఆధారం
భక్తి లేకున్నా విజ్ఞానం లేదంటేనే మనిషికి విలువ లేదు

వినాయక విగ్రహాలన్నీ నీటిలోనే వేస్తే

వినాయక విగ్రహాలన్నీ నీటిలోనే వేస్తే త్రాగడానికి మంచి నీరు ఎలా
ఎన్నో పెద్ద విగ్రహాలను నిర్మించి చివరకు గంగ లోనే సమస్తము
వినాయక విగ్రహంలోని వస్తువులన్నీ గంగలో వికృత కలుషితమే
కలుషితమైన నీటిని సేకరించి కలుషితంగా జీవించి మరణించు
పండగను అజ్ఞాన అనర్థకంగా చేసుకోవడం కంటే విజ్ఞాన భావం గొప్పది
విజ్ఞాన భావంతో సమాజాన్ని మార్చుటకు ప్రయత్నించు
కలుషితమైన చెత్త కుప్పల దగ్గర వాహనాలు పోవడానికి వీలు కాకుండా
రహదారులలో ఇబ్బందికరంగా ఎక్కడంటే అక్కడ కూర్చోపెడుతున్నారు
ఆత్మ జ్ఞానం లేకుండా జీవించటంతోనే ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి
ఏ పండగా లేకుండా అనర్థం లేకుండా విజ్ఞాన సహాయ కార్యాలు చేపట్టండి
మీకు సత్య విజ్ఞాన వినాయకుని విశ్వ రూప ధర్మ భోధన చేస్తాను
నీలోని బుద్దున్ని నేను నీ మేధస్సున చూపిస్తాను ఎరుకతో గమనించు

నీవు నేర్చిన విజ్ఞానం ఎలాంటిదో నీ

నీవు నేర్చిన విజ్ఞానం ఎలాంటిదో నీ ప్రవర్తనలో తెలుస్తున్నది
ప్రతి క్షణాన్ని ఎలా గడిపావో ఆలోచించి చూస్తే తెలుస్తుంది
అజ్ఞానంగా ఉంటే విజ్ఞానంగా మారడానికి ప్రయత్నించు
విజ్ఞానంగా ఉంటే ఇంకా సూక్ష్మ విజ్ఞానంతో జీవించు
ఇంకొకరికి అనవసరంగా ఇబ్బంది కలిగించినట్లయితే అజ్ఞానమే

ఏ జీవిని సంపూర్ణంగా అర్థం

ఏ జీవిని సంపూర్ణంగా అర్థం చేసుకున్నావు
ఏ జీవి భావ స్వభావాలు నీకు తెలుసు
ఏ జీవి మేధస్సు శక్తి ఎంత సామర్థ్యమైనది
ఏ జీవి గుణ లక్షణ తత్వాలు తెలుసు
ఏ జీవి ఎలా ఎంత కాలం జీవిస్తుంది
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని విషయాలో

జీవితానికి కాలమే ప్రధాన అంశం

జీవితానికి కాలమే ప్రధాన అంశం
కాలం ఎలా ఉంటుందో జనన మరణానికే తెలియదు
దేనిని ఎందుకు సృష్టిస్తుందో ఇంకా తెలియకున్నది
ఉపయోగాలు మానవ మేధస్సుకు తెలిసినా విశ్వ భాష తెలియదే
విశ్వ భాష పరమార్థం భావ స్వభావాలలోనే నిక్షిప్తమైనది
కాలం ఎలా గడిచిపోతున్నా మనం విజ్ఞానంగా ఎదగాలి
జీవించుటలో ఆత్మ విజ్ఞానం లేకుంటే అంతా కాల ప్రభావమే

శూన్యాన్ని ఆలోచించి సరైన

శూన్యాన్ని ఆలోచించి సరైన అవగాహన లేక ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు
నాలో కలిగిన శూన్య భావన క్రమ స్థాన విధానాన్ని ఏనాడో వివరించాను
శూన్యము మర్మ కాలమున జన్మతో మరణించి క్షణముగా ఆరంభమైనది
క్షణముతో క్షణం ఏకమై కాలముగా నేటి వరకు అణువు నుండి విశ్వమైనది

విశ్వ తత్వ భావనలు తెలియకుండా

విశ్వ తత్వ భావనలు తెలియకుండా విశ్వ కవిని గుర్తించలేము
విశ్వ భావ స్వభావాలను సూక్ష్మంగా తెలిపేవారే విశ్వ కవులు
విశ్వ కవులకు తెలుసు గత భవిష్య కాల భావ ప్రభావాలు
విశ్వ విజ్ఞానిగా విశ్వ కవి భావాలు ఆశ్చర్య అతిశయోక్తియే

జీవితాన్ని ఓ సారి గమనించు గమ్యం

జీవితాన్ని ఓ సారి గమనించు గమ్యం ఎటు వెళ్ళుతుందో
నీవు ఎటు వెళ్ళాలో వెళ్ళుతున్న గమ్యం సరైనదా ఆలోచించు
సరికాని గమ్యమైతే వెళ్ళే దారిని మార్చుకుంటూ అధిగమించు
సరైన గమ్యంతో జీవితాన్ని సరి చూసుకొని విజ్ఞానంగా జీవించు

బంధాలు విడిపోయినందుకే

బంధాలు విడిపోయినందుకే సంతోషంగా జీవించకలేక పోతున్నాము
మనవారంతా మనము వెళ్లలేనంత దూరానికి వెళ్ళిపోయారు
వారు ఎప్పుడు వస్తారో జ్ఞాపకాలలోనే చూసుకుంటున్నాము
వారే మనవద్దకు రావాలి మనం వెళ్ళాలన్నా ఒకరు లేదా ఇద్దరు
ఆర్థికంగా ఆ దూరాన్ని చేరుకోవడానికి చాలా ఖర్చవుతుంది
సాంకేతిక జ్ఞానము ద్వారా మాట్లాడవచ్చ్చు చూసుకోవచ్చు
అక్కడ సామాచారాన్ని తెలుసుకోవచ్చు వారి చిత్రాలను చూడవచ్చు
కొంత దూరాన ఉన్నా వెళ్ళడానికి సమయం చాలటం లేదు
పాత వారు కొత్త వారు యిలా ఎన్నో కలిసాయి విడిపోయాయి
కనిపించినా మాట్లాడలేని రోజులు గడిచినా గ్రహించలేక పోతున్నాము
జ్ఞాపకాలలో ఉన్నవారిని కలుసుకోలేక మేధస్సులోనే ఊహా భావాలు
జ్ఞాపకాలలో లేనివారు మన ఎదుట ఉన్నామాట్లాడలేక పోతున్నాము
నేడు తల్లిదండ్రులకు ఇష్టం లేని విధంగా ఎందరో వెళ్ళిపోతున్నారు
ఇరవై ఏళ్ళు దాటితే మన పిల్లలు మనతో ఉండరు ఎక్కడికో వెళ్ళిపోతారు
మానవ విజ్ఞానం ఎక్కడికో ఎన్నో విధాల వెల్లిపోతూనే ఉన్నది

* ఓ సారి ప్రశాంతంగా సముద్ర తీరాన

ఓ సారి ప్రశాంతంగా సముద్ర తీరాన నిలిచి ఓ రోజంతా గమనించండి
ఓ రోజు కాకపొతే కొన్ని వారాలు నెలలు సంవత్సరాలు గమనించు
ఆకాశం తిరుగుతున్నాదా సూర్యుడు తిరుగుతున్నాడా గమనించు
సూర్య చంద్రులతో పాటు నక్షత్రాలు కూడా తిరుగుతూనే ఉన్నాయా
భూమి తిరిగితే సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు ఏ కక్ష్యలలో తిరుగుతాయి
మనకు కనిపించే సూర్య చంద్ర నక్షత్రాలు సగం రోజుకు ఆకాశాన్ని దాటేస్తున్నాయి
నాకు అనిపించే భావాన ఆకాశమే భూమి చుట్టూ తిరుగుతుందేమో
ఆకాశం తిరుగుటలో భూమి తిరగటంతో కక్ష్యలు మారుతున్నాయేమో
ఆకాశం తిరగటంతో సూర్య చంద్ర నక్షత్ర గ్రహాల కక్ష్యలు మారుతున్నాయేమో
ఆకాశం చాలా తేలికైనదని నా గురత్వాకర్షణ లేదా విశ్వ సమతుల్యత భావన
సమతుల్యత శక్తితో భూమి నిలిచే ఉందని ఆకాశ చలనమే తెలుపుతుందా
ఆకాశం తన చుట్టూ తాను తిరుగుటకు ఓ రోజు సమయం పడుతుంది
సూర్యుడు తిరుగుట లేదని ఓ నిర్దిష్ట స్థాయిలో ఆకాశాన నిలిచి ఉన్నాడేమో
ప్రతి రోజు ఒకే స్థానమున ఉదయించుటలో ఆకాశంతో తిరుగుతున్నాడేమో
చంద్రుడు రోజుకు ఓ కక్షలో నెలకు కొన్ని కక్ష్యలలో అలా ప్రతి నెలా వివిధ రూపాలతో కనిపిస్తూ -
ప్రతి నెల అవే కక్ష్యలలో తిరుగుతూ ఉన్నాడేమో (నెలకు అటు ఇటూ కొన్ని సార్లు మార్పు) -
విశ్వమున నీవు ఆకాశాన్ని గమనిస్తూ విశ్వ భావనతో లీనమై తెలుసుకో
విశ్వ భావ సారాంశ శాస్త్రీయ విజ్ఞానాన్ని క్షుణ్ణంగా అవగాహనతో పరిశీలించు
విశ్వ విజ్ఞాన శాస్త్రీయ విజ్ఞానము అనుభవానికి మహా మేధస్సుతో కూడినది

Saturday, September 11, 2010

జీవితాలు మారవు మార్చుకోలేము

జీవితాలు మారవు మార్చుకోలేము అజ్ఞాన మేధస్సుతో జీవిస్తున్నామని గ్రహించలేము -
ఎలా జీవించాలి ఎందుకు జీవిస్తున్నాము ఉన్నవారికి మనకు మేధస్సు వ్యత్యాసమేనా -
విజ్ఞానంగా ఎదిగేందుకు అవకాశం ఎలా వస్తుంది మేధస్సును ఎలా మెరుగు పరచాలి -
ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి ఎలా వివేకవంతునిగా ఒడిదుడుకులను అధిగమించాలి -
మారలేని జీవితాలకు విశ్వ భావాల ధ్యానం ఓ సన్మార్గమేనని నా విజ్ఞాన విశ్వ భావన -

విశ్వ విజ్ఞానం తెలిపే నా భావాలను

విశ్వ విజ్ఞానం తెలిపే నా భావాలను కొన్నైనా మేధస్సుతో గమనించండి
రేపటి సమస్యల పరిష్కారానికి నా భావాలు ఎంతో ఉపయోగపడుతాయి
ప్రతి జీవి సమస్యల కారణ భావాలను గమనించే జ్ఞానం నా భావాలలోనే
విజ్ఞాన భావాల విశ్వ భాషలో నా జీవితాన్ని లెక్కించుట లేదు ఎందుకో
నా జీవితం కన్నా విశ్వ జీవుల జీవిత విజ్ఞానం నా మేధస్సుకు శ్రేయస్సు

కొంతైనా నా భావ విజ్ఞానం మీ

కొంతైనా నా భావ విజ్ఞానం మీ మేధస్సుకు చేరుతుందని ఆశయం
సామాజాన్ని మార్చేందుకు శ్రమించకున్నా సమస్యలను తెలుసుకుందాం
భావాలుగా ఎన్నో గ్రహించినా ఇంకా ఎన్నో విజ్ఞానంగా మిగిలి ఉంటాయి
కాలక్షేపంలో భావాలను గ్రహించడం ధ్యానించడం విశ్వ భాష పరమార్థం

ప్రతి దానికి మేధస్సు కారణమైతే కర్మ

ప్రతి దానికి మేధస్సు కారణమైతే కర్మ జీవితాలు తొలగిపోవునా
జన్మించుటలో శరీర రూపాల లోపానికి కర్మ కారణం కాదా
విజ్ఞానంగా జీవిస్తే కర్మ సమస్యలు తొలగినా శరీర రూపాలు మారవు
ప్రతి జీవికి అజ్ఞానం కర్మ కాలం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి
శరీర రూపాలు మారకున్నను అజ్ఞానాన్ని విజ్ఞానంతో వదిలించుకో
కర్మను ధ్యానంతో విజ్ఞానంగా నశింపజేసి విశ్వ భావాలను తెలుసుకో
విశ్వ భావాలతో ఎందరి జీవితాలను మార్చగలవో ఆలోచించు
నా లోని విశ్వ భావాలు ఎందరికో అందాలని విశ్వ భాషతో జీవిస్తున్నా

జీవించుటకు దేహము చాలురా అని

జీవించుటకు దేహము చాలురా అని శ్వాస తెలుపున్నది రా
నాకు తెలిసినా దేహా రూపాలు ఎటువంటివో గమనించాను రా
కర్మ కూడా శ్వాసతో దేహాన్ని వెంటాడి హరించును రా
ఆత్మను కూడా వేధించి శరీరాన్ని త్రుంచేసి జీవింపజేయును రా
కాళ్ళు చేతులు కళ్ళు మేధస్సు చెవులు లేకున్నా శ్వాస జీవించును రా
ముక్కు నోరు దేహము ఈ మూడున్నా మనిషి జీవించును రా
గాలి ఆహారం శ్వాస నాళం జీర్ణ వ్యవస్థ ఇవే ముఖ్యము రా
ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఏ జీవి జీవించదు రా
శిరస్సు దేహము మాత్రమే ఉన్నవారున్నారని నాకు తెలిసేను రా
ఎన్నో లేనివారు కర్మతో జీవిస్తూనే ఉన్నారు
అడుక్కోవడానికి కూడా వీలు లేనంతగా జీవిస్తున్నారు
చలనం ఉన్నా చలించుటకు వీలుకాని వారెందరో జీవిస్తూనే ఉన్నారు
కర్మ కుటుంబాలకు రక్త సంబంధాలు లేవురా
విశ్వాన్ని సూక్ష్మంగా తిలకిస్తే దేహ కర్మతో జీవించే వారెందరో తెలియునురా
భావాలకు కూడా అందని కర్మలకు దేహములు విచిత్ర రూపాలతో జీవిస్తున్నాయి
ఎటువంటి సహాయం చేసినా సుఖం ఎరుగని రీతిలో దేహాలు వంకరగా ఉన్నాయి
విశ్వ భాషకు కర్మ విజ్ఞానం చాలదురా అనుభవించినా అర్థం కాదురా
ప్రతి జీవి జీవితాన్ని నేనే జీవిస్తున్నట్లు విశ్వ భాషతో తెలుపుకుంటున్నానురా
ప్రతి భావన నాదే నని నా మేధస్సున ప్రతీది నిలిచిపోతున్నదిరా
జన సంఖ్య తక్కువైతేనే ఎన్నో సమస్యలు తక్కువైతాయి విజ్ఞాన ఎరుకతో గమనించండి
శరీర ఆకృతులు సరిలేని వారు సంపాదన లేనివారు ఒకరిని కంటే చాలు
పిల్లలు లేని తల్లిదండ్రులే సమాజ సమస్యలకు భగవంతులని నా విశ్వాస విశ్వ భావన

శ్వాస ఎటువంటిదో తెలుసుకున్నాను

శ్వాస ఎటువంటిదో తెలుసుకున్నాను హరా
జీవించుటకు శ్వాస చాలని కర్మతో తెలుసుకున్నాను హరా
ఎందరో కర్మలతో ఎన్నో విధాల జీవిస్తూనే ఉన్నారు హరా
ప్రతి జీవికి ఆహార నాళం ఉంటే చాలని శ్వాస తెలిపేను హరా
కష్టమైనా నష్టమైనా దుఖ్ఖాన్ని అనుభవించేది శ్వాసే హరా

మీ విజ్ఞాన ఆనందం కోసమే నా

మీ విజ్ఞాన ఆనందం కోసమే నా భావాలు తెలుపుతున్నా
నా భావాలతో విశ్వ విజ్ఞానాన్ని జగతికి అందించాలనుకున్నా
ప్రపంచ శాంతికై నా భావాలను విశ్వమున అన్వేషిస్తున్నా
నిద్రించుటలో కూడా భావాలు విజ్ఞానంకై అన్వేషిస్తూనే ఉన్నాయి
నా భావాలు లేని విశ్వం అజ్ఞాన చీకటిగా మారుతుందనే నా తపన

కర్మకు శక్తులెన్నో మేధస్సున అజ్ఞాన

కర్మకు శక్తులెన్నో మేధస్సున అజ్ఞాన ఆలోచనలెన్నో
తరిగిపోని కర్మకు అజ్ఞాన ఆలోచనలు పెరుగుతున్నాయెన్నో
కర్మ జీవులకు కాలం విజ్ఞానం కల్పించుట లేదు ఎందుకో
కర్మ జీవుల మేధస్సున అజ్ఞాన ఎరుక మెలకువతో ఉన్నదా
కర్మను తొలగించుట కోసమే ధ్యానించరా మహానుభావా

Friday, September 10, 2010

నీ విజ్ఞానం ఎలాగో మహాత్ములలో

నీ విజ్ఞానం ఎలాగో మహాత్ములలో ఎవరికి తెలియదు
కనీసం నీ రూపమైన విశ్వ రూపాలకు తెలుసా
సూర్య చంద్రులకైనా నీ రూపం గుర్తుందా
నీవు ఏనాడైనా లీనమై సూర్య చంద్రులను తిలకించావా
ఏ నక్షత్రాన్నైనా గొప్పగా మహా భావాలతో తిలకించావా
మేఘ వర్ణ భావ రూపాలను ఏ క్షణమైనా గమనించావా
ఏ రూపానికి తెలియని నీ రూపం విశ్వమున ఎందుకో
నీ రూపము విజ్ఞానము విశ్వంలో నిలిచిపోవుటకు ధ్యానించు
అనంత విజ్ఞానాన్ని విశ్వ భావాలతో మేధస్సున సేకరించు
జీవిత పరమార్థాన్ని ఆత్మ జ్ఞానంతో గ్రహిస్తే ఎక్కడైనా నీవే
నీవు ఎవరికి తెలియకపోయినా నీకు ఎవరు తెలియకపోయినా
విశ్వ రూప భావాలలో నీవే ఉదయిస్తూ ఆత్మగా నిలిచి ఉంటావు

ప్రతి జీవి విజ్ఞానాన్ని నా మేధస్సులో

ప్రతి జీవి విజ్ఞానాన్ని నా మేధస్సులో ఎలా దాచుకున్నానో విశ్వ భావనకే తెలియకున్నది -
విశ్వ భావాలుగా నాలో ఎన్నో దాగి ఉన్నా ప్రతి జీవి పరమార్థం ఒక్కటే అదే నా మేధస్సున -
విశ్వ భావనగా ఏ భావాన్ని తెలిపినా ఒక జీవిగా ప్రతి జీవిలో ఆలోచించవలేననే అర్థము -
విశ్వ భాషకు ఆత్మ తత్వమే భావాలను గ్రహిస్తూ ఎంతో విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నది -

విశ్వమున నీవే బ్రంహా విష్ణు

విశ్వమున నీవే బ్రంహా విష్ణు మహేశ్వర
నీవే కర్త కర్మ క్రియ కాల జ్ఞాన నిర్ణేతవు
విశ్వము నీవే విశ్వమందున్నది నీదే
నీలో ఆత్మ జ్ఞానం లేక అజ్ఞాన ధ్యాసలో ఉన్నావు
నీలో ఆత్మ జ్ఞానమునకై విశ్వమే శ్వాసగా నీలోనే
శ్వాసను గమనించుటలో నీలో ఆత్మ జ్ఞానిస్తుంది
ఆత్మ జ్ఞానంతో విశ్వ పరమాత్మను దర్శించు
బ్రంహా విష్ణు మహేశ్వరులంతా కాల విజ్ఞానులే
ప్రతి అణువున నీవే ప్రతి జీవ పరమార్థమున నీవే
ఎంత తెలిపినా విశ్వ అర్థాన్ని గ్రహించుటకు మానవ మేధస్సు చాలదు
నాలోని విశ్వార్థమే నన్ను విశ్వమున ప్రయాణింపజేస్తూ విశ్వ విజ్ఞానాన్ని కలిగిస్తున్నది

ఎన్నో విశ్వ భావాలు మీకు

ఎన్నో విశ్వ భావాలు మీకు తెలియాలంటే ధ్యానమే
ధ్యాన భావాలతో ఆకాశాన్ని తిలకిస్తే విశ్వ భావార్థం
ఆకాశ వర్ణ రూప భావాలకు నేత్రాలు దివ్య ధ్యాసలో
నిత్యం తిలకించుటలోనే మహా విశ్వ భావాలు ఎన్నో
విశ్వమున కనిపించని రూపాలు మీ నేత్ర భావాలలోనే
నేత్రాలు చలించని విశ్వ కాంతి రాప భావాలు ఆకాశముననే
జీవన జీవిత జీవుల భాషా భావాలు అర్థాలుగా ఆకాశమందే
తిలకించుటలో ఆలోచనలు తెలిపే భావాలు విశ్వామృతమే
భావాలను గ్రహించే ఆలోచనలు తిలకించుటలో గమనించే దివ్య క్షణాలు

నగరముల యందు సరైన ప్రణాళిక

నగరముల యందు సరైన ప్రణాళిక లేకపోతే సమస్యలెన్నో
వాహానాల కాలుష్యం ప్రాణ వాయువును హరించి వేస్తుంది
వర్షాల నీటి ప్రవాహాలు ఇంటిలోనే సాగిపోయి రోగాలకు నిలయమే
సరైన నిద్ర ఆహారాలు వసతులు ఆలోచనలు లేకుండా పోతాయి
మురికి కాలువలు ఎక్కువై జీవించుటకు వీలు కాకుండా పోతుంది
చెత్త పెరుగుతూ నడవాతానికి వీలు కాని దుర్వాసనలు ఎన్నెన్నో
శిరస్సుల జ్ఞానేంద్రియాలు పనిచేయక జీవించుటకు అవస్థాలెన్నో
జన సంఖ్య ఎక్కువై సరైన జీవితాలు లేక కాలంతో సాగుతున్నారు
కష్టాలను చెప్పుకున్నా కనిపించే గాంధి వినిపించుకునే తెరెసా లేరు
కార్య కారణ క్రమ విదాన ప్రణాళిక లేక నగరాలు దుర్లభమే
ఆర్థికంగా పని చేస్తున్నంత కాలం సమాజాలు ఏనాటికి మారవు
సాంకేతిక విజ్ఞానంతో పాటు దోచుకోవడం మోసాలు ఎక్కువవుతున్నాయి
నాలో ప్రణాళిక ప్రపంచాన్ని మార్చే విధంగా ఉన్నా తెలుసుకునే వారు లేరు

ఒకరి అజ్ఞాన భావనలు తొలగి

ఒకరి అజ్ఞాన భావనలు తొలగిపోవాలనే నా భావాలను విజ్ఞానంగా తెలుపుతున్నా
మనస్సులో కలుషితం ఉంటే మేధస్సులో కలుషితమైన అజ్ఞానమే చేరుతుంది
మనస్సులో విశ్వ భావన ఉంటే మేధస్సులో విశ్వ భావ విజ్ఞానమే కలుగుతుంది
మనస్సును మేధస్సుకు జత చేసి అన్వేషించండి విశ్వ భావాలు తెలిసిపోతాయి
విశ్వ భావాల జీవితం మహాత్ముల విజ్ఞాన సారాంశ ఆధ్యాత్మ జీవన విధానం

విశ్వ భావాలతోనే విశ్వ రూపాలలో

విశ్వ భావాలతోనే విశ్వ రూపాలలో లీనమై జీవిస్తున్నా
ఏ రూపాన్ని చలింపజేసినా నా భావాలు చలిస్తుంటాయి
విశ్వ భావాలకు అర్థం విశ్వ శాస్త్రీయ మర్మ రహస్యమే
అణువుగా జీవించినా పరమాణువుగా తెలియని మాహా రూపం నా భావ విశేషం

విశ్వ విజ్ఞానం నీదే మరచి ఉన్నావు

విశ్వ విజ్ఞానం నీదే మరచి ఉన్నావు నేటి జన్మతో
విశ్వాన్ని తిలకించుటకు మరల జన్మించావు
విశ్వ విజ్ఞానంతో విశ్వమున ప్రతి రూపాన్ని తిలకించాలని
పరమాత్మ నుండి ఆత్మగా శరీర దేహంతో జన్మించావు
శరీరం పంచ భూతాలతో నిర్మితమైన మహా దేహం
విశ్వ విజ్ఞానం మరలు గుర్తు రావాలనే పంచభూతాల శరీరం
పంచభూత శరీరంలోనే విశ్వ తత్వ ఆత్మ భావాలు దాగి ఉన్నాయి
పరమాత్మను నీవు గ్రహించేందుకు శరీరంలో శ్వాస ప్రవేశించింది
శ్వాస గమనంతో నీవు విశ్వాన్ని దివ్య భావాలతో తిలకించగలవు
విశ్వ విజ్ఞానం నీదైతే విశ్వము నీదే విశ్వమున ప్రతి రూపము నీదే
విశ్వ విజ్ఞానముకై నీ భావాలతో ధ్యానించు విశ్వము నీదవుతుంది

Thursday, September 9, 2010

కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో

కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో భావాలను తెలుసుకోవాలి
విశ్వ భావాలు తెలియకుండా దేనిని గ్రహించలేవు నిలువలేవు
విశ్వ భాషతో జీవిస్తే కాలం విశ్వమున నిన్ను జీవించేలా చేస్తుంది
జీవితానికి కాలం లేదంటే అజ్ఞాన కర్మతో ఆత్మ చింతించడమేనేమో

కాలం ఎలాంటి కష్టాన్నైనా క్షణాలలో

కాలం ఎలాంటి కష్టాన్నైనా క్షణాలలో తెచ్చి పెడుతుంది
మన విజ్ఞానానికి కాలం భవిష్య ఆలోచనను కల్పించదు
అనుభవానికి జాగ్రత్తకు మన మేధస్సు నిలువవుండదు
మన ఆలోచనలు ఎన్నో మన కార్యాలు ఎన్నో రకరకాలుగా
కాలానికి తెలిసిన జ్ఞానం మనలో కలగాలంటే విశ్వ భాషే
విశ్వ భాషకై విశ్వ భావాలను గ్రహించుటలో అర్థమున్నది
జీవిత అర్థాలకు కార్య కారణ ఆలోచనలు తెలియాలి
కాలం తెలిపే భావాలకు మనం విశ్వ భాషతో ధ్యానించాలి
శ్వాసపై ధ్యాసతో ధ్యానిస్తే ఆత్మ జ్ఞానం జీవిత అర్థాన్ని తెలుపుతుంది

కవితలో హాస్యం కన్నా జీవిత అర్థాన్ని

కవితలో హాస్యం కన్నా జీవిత అర్థాన్ని ఎక్కువగా గమనించాలి
అర్థాలు తెలియకపోతే ఏది హాస్యమో ఏది జీవితమో తెలియదు
అర్థాలు జీవిత ఆశయాల భాధ్యతలను తెలుపుతూనే ఉంటాయి
మనం దేనిని తిలకించినా గ్రహిస్తున్నా జీవిత అర్థాన్నే గమనించాలి

మీ భావాలకన్నా నా భావాలలో

మీ భావాలకన్నా నా భావాలలో ఎక్కువ విజ్ఞానం ఉంటే గ్రహించండి
నా భావాలలోని అర్థాలు ఎంత వరకు ఎందరికి ఎలా ఉపయోగకరం
నా భావాలు విశ్వ విజ్ఞానాన్ని హంస స్వచ్ఛతతో తెలుపుతున్నాయా
భావాల ఆలోచనలకు విశ్వార్థమున్నదా విశ్వ భాషను తెలుపుతున్నదా

మీరు మెచ్చిన మీకు నచ్చిన భావాలే

మీరు మెచ్చిన మీకు నచ్చిన భావాలే నే తెలుపగలను
విశ్వ భావాలను ఎందరికోసమో తెలుపుతూనే ఉన్నా
మేధస్సులో కలిగే ఆలోచనలకు స్పూర్తి ఏ భావాలు
భావాలను గ్రహించే ఆలోచనలే నా మేధస్సుకు స్పూర్తి

విజ్ఞేశ్వరుని రూప అర్థాన్ని

విజ్ఞేశ్వరుని రూప అర్థాన్ని గ్రహించండి
శిరస్సు - విశ్వ విజ్ఞానాన్ని మేధస్సున గ్రహిస్తుంది
కళ్ళు - విశ్వాన్ని ఆకాశంలా కరుణతో తిలకిస్తుంది
చెవులు - విశ్వంలో ప్రతి సూక్ష్మ శబ్దాన్ని గమనిస్తుంది
తొండం - శ్వాసను గమనిస్తూనే ఎరుకతో ధ్యానిస్తుంది
దంతం - అజ్ఞానం కష్టమైనా వదిలించుకో
నోరు - ఎవరు ఎంత దూరమున్నా ఆదుకో
శరీర దేహము - విశ్వ విజ్ఞానాన్ని ఎంతైనా స్వీకరించండి
ఎలుక - ప్రతి జీవికి ఒకే శ్వాస ఒకే ప్రాణమే
సంపూర్ణ రూపము గురువుగా భోదిస్తూనే ఉంటుంది

ఒకరు చదివే విషయాన్ని అర్థవంతంగా

ఒకరు చదివే విషయాన్ని అర్థవంతంగా తెలపండి
మంచి పదాలతో మంచి భావార్థాలతో లిఖించండి
వ్రాయటం వచ్చని మేధస్సు లేకుండా వ్రాయకండి
విశ్వ విజ్ఞానమున నిలిచే మహా జ్ఞానాన్ని తెలపండి
ఎప్పటికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే జ్ఞానాన్ని ఎంచుకోండి
కాలం మారినా సాంకేతిక విజ్ఞానం వస్తున్నా నీతి ఒక్కటే
పదాలలో పరమార్థాన్ని తెలుపుటకు మేధస్సును ఉపయోగించండి
మనం వ్రాసే విధానం ద్వారా సమాజంలో అవే మాటలు వినిపిస్తాయి
అజ్ఞాన పదాలు నా నాలుకకు అందకుండా పోతున్నాయి
చెవిని తాకే అజ్ఞాన మాటలు మేధస్సుకు చేరకున్నాయి
సమాజాన్ని మార్చే ఆయుధం పదాలలో కనిపించాలి

విశ్వమున జీవులకు ఎన్ని రోగాలో

విశ్వమున జీవులకు ఎన్ని రోగాలో చిత్రముగా ఉన్నాయి
మానవునికే వైద్య సహకారాలు అందుతున్నాయి
పెంచుకున్న జీవులకు కూడా వైద్య సదుపాయాలు కలవు
సమాజమున కనిపించే జీవులకు వైద్య సహకారం లేదు
సమాజంలో జీవుల రోగాలు వాటి కష్టాలు అనిర్వచనీయం
ఎన్నో సదుపాయాలున్నా వైద్యం అందని జీవులు ఎన్నో
ఆర్థికంగా పనిచేసేవారికి ఇతర జీవులు రోగాన్ని తెలుపలేవు
ప్రతి జీవి ఏనాడు సుఖంగా జీవిస్తుందో తెలియుట లేదు
ప్రతి జీవి ఆరోగ్యం కోసం నిత్యం ధ్యానిస్తూ జీవించండి

విశ్వమున నీకు సంతోషం

విశ్వమున నీకు సంతోషం కలుగుతున్నదా సంతోషంగా జీవించాలనుకున్నావా
సంతోషంగా నీవు జీవిస్తున్నా నీ వారు సంతోషంగా ఈ విశ్వమున జీవించుటలేదు
సంతోషం కలిగేటప్పుడే విశ్వంలో ప్రయాణిస్తూ ఎన్నో జీవితాలను సూక్ష్మంగా పరిశీలించు
జీవితాలకు విజ్ఞాన అర్థాన్ని కల్పిస్తూ విశ్వ భావాలతో జీవించేలా నీవు ధ్యానించు

విశ్వమున కనిపించేవన్నీ నీ విజ్ఞానం

విశ్వమున కనిపించేవన్నీ నీ విజ్ఞానం కోసమే
దేనిని ఎక్కువగా తిలకిస్తావో ఆ విజ్ఞానమే నీలో
విశ్వ విజ్ఞానముకై దివ్య రూపాలను తిలకించు
మరో విశ్వంలో ఎన్ని రూపాలో ఆకాశాన చూసుకో
ఆకాశాన కనిపించే రూపాలన్నీ విశ్వ విజ్ఞానం కోసమే

జగతిలో జీవించుట నేర్చుకో ఆపై

జగతిలో జీవించుట నేర్చుకో ఆపై విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకో
ఎన్నో విషయాలను అర్థం చేసుకో ఆపై ఎన్నిటినో పరిశీలించు
అవగాహానతో ఎన్నో జీవన అనుభవాలను విజ్ఞానంగా నేర్చుకో
అనుభవాలతో ఎన్నో విశ్వ విజ్ఞాన రహస్యాలను వివరించు

ఆశ్చర్యకర అద్భుత విశ్వ విజ్ఞానం

ఆశ్చర్యకర అద్భుత విశ్వ విజ్ఞానం కోసమే చదవండి
నా భావాలలో ఎన్నో అద్భుత విశ్వ భావాలున్నాయి
సూక్ష్మ పరిశీలనతో గ్రహించినవే నా విశ్వ అద్భుతాలు
విశ్వ విజ్ఞానమున నా భావాలు ఎప్పటికీ ఉంటాయి

మీకోసమే నా భావాల జీవన

మీకోసమే నా భావాల జీవన పరమార్థం
ఏనాటికైనా నా భావాలే నిలిచిపోవాలని
విశ్వ భాషార్థముతో విజ్ఞానంగా తెలుపుతున్నా
ఎవరికి తెలియని విశ్వ భావాలు కూడా నాలోనే

విషయానికి అర్థం లేదంటే చర్చించుట

విషయానికి అర్థం లేదంటే చర్చించుట అనర్థమైన కాలమే
వృధాగా సాగించే జీవితానికి అనర్థాలే ఎదురవుతుంటాయి
కాలానికి మేధస్సు లేక మన మేధస్సుకు అజ్ఞానం ఎందుకు
మన మేధస్సులో విజ్ఞానమే ఉంటే కాలం కూడా విజ్ఞానంగా సాగేను

విశ్వ రూపాలను ఎంతవరకు చూస్తానో

విశ్వ రూపాలను ఎంతవరకు చూస్తానో తిలకించుటలో తెలియుటలేదు
విశ్వ భావాలను ఎంతవరకు నా మేధస్సులో దాచెదనో తెలియుటలేదు
విశ్వంలో ఉన్నానని నేటికి ప్రయాణిస్తూనే విశ్వాస శ్వాసతో జీవిస్తున్నా
మరవలేని విశ్వ రూప భావాలకు నా శ్వాస ఆగలేక జీవిస్తూనే ఉంది

పరమాత్మా! నిన్ను దర్శించుటలో

పరమాత్మా! నిన్ను దర్శించుటలో నా నేత్ర భావన నిలిచిపోయింది
నేత్రాలలో నీ రూపం చలించలేక విశ్వ భావనతోనే నిలిచిపోయింది
మేధస్సులో కూడా ఏ భావాలు లేక మహా భావంతో నిలిచిపోయింది
శ్వాస కూడా చలించని విధంగా దివ్య భావనతో ఆగిపోయింది

ఎవరెవరు విజ్ఞానముకై నాతో కలిసి

ఎవరెవరు విజ్ఞానముకై నాతో కలిసి జీవించేందుకు వస్తారో
విశ్వ భావాలతో జీవించే జీవితాలను ఎవరెవరికి అందిస్తారో
ఒకరితో ఒకరు కలిసిపోతూ నా భావాలు ఎవరికి చేరుతాయో
నా భావాలు విశ్వ భాషలో కలవాలనే ప్రతి జీవికి విజ్ఞానమే

ఎంతకాలం జీవిస్తావో నీకు తెలియక

ఎంతకాలం జీవిస్తావో నీకు తెలియక ఎవరికి తెలుసు
ఎందరినో కలుసుకొని ఎన్నో జీవితాలను గమనిస్తావు
అర్థమవుతున్న జీవితాలే చివరికి అర్థంకాక పోతాయి
సమస్యలు ఎంతటివో మేధస్సుకు సందేహమైపోతాయి

అద్భుతం నీయందే ఉంటే ఎక్కడెక్కడో

అద్భుతం నీయందే ఉంటే ఎక్కడెక్కడో వెతికెదవు
నేవు సృష్టించుకున్న లోకమే నీ శ్వాసలో ఉన్నది
నీ శ్వాస తెలిపిన అద్భుతాన్నే నీవు సృష్టించుకో
నీ అద్భుతాన్ని తెలుసుకొనుటకే శ్వాసతో ధ్యానించు

విశ్వమున జీవించే నీకు ఎవరెవరు

విశ్వమున జీవించే నీకు ఎవరెవరు తెలుసు
ఎక్కడో జీవించే వారికి నీవు ఎవరని తెలుసు
ఎవరినో తెలుసుకుంటావని ఏనాటికి తెలుసు
నీవెవరివో తెలియాలని నీ మనస్సుకే తెలుసు
ఈ జీవితం ఎంతవరకో ధ్యానించే నీ శ్వాసకే తెలుసు

అజ్ఞానంతో ఉన్న మేధస్సుకు భక్తి

అజ్ఞానంతో ఉన్న మేధస్సుకు భక్తి ఎందుకు
అజ్ఞానాన్ని తొలగించుకోలేని మేధస్సు ఎవరికి
అజ్ఞానంగా ఎంతకాలం జీవిస్తూ కాలాన్ని వృధా చేస్తారు
అజ్ఞానమే లేని మేధస్సుకై విశ్వ భావాలతో జీవించండి
విశ్వ భావాలకై ధ్యానించుటయే మీ శ్వాస గమనార్థం

Wednesday, September 8, 2010

రోగాలు అజ్ఞానాన్ని తొలగించుటకే

రోగాలు అజ్ఞానాన్ని తొలగించుటకే కలుగునేమో
ఎందరికో మరో జీవితాలు తెలియాలని రోగాలేమో
రోగాలతో ఎన్ని మార్పులు జరుగునో గమనించవలనేమో
రోగాన్ని జయించుటకు శ్వాసతో నేనే ధ్యానించవలనేమో

ధ్యానించుటలో సకల రోగాలు

ధ్యానించుటలో సకల రోగాలు పోవునని శ్వాసను గమనించు
ధ్యానించుటలో గ్రహ దోషాలు తొలగునని శ్వాసనే గమనించు
ధ్యానించుటలో శత్రువులు మిత్రులగురని శ్వాసనే గమనించు
ధ్యానించుటలో జీవితం సంతోషాలతోనేనని శ్వాసనే గమనించు

విశ్వ విజ్ఞానమునకై విశ్వ నాభిలో

విశ్వ విజ్ఞానమునకై విశ్వ నాభిలో ధ్యానిస్తున్నా
విశ్వ భావాలకై విశ్వముననే ప్రయాణిస్తున్నా
విశ్వ రూపాలతోనే విశ్వ భాషను గ్రహిస్తున్నా
విశ్వ జీవులయందే విశ్వ భావాలను గమనిస్తున్నా
విశ్వ విజ్ఞానంతో అజ్ఞానం తొలగునని ప్రయత్నిస్తున్నా

ఒక క్షణంలో నా మేధస్సున కలిగే

ఒక క్షణంలో నా మేధస్సున కలిగే భావాలే ప్రతి జీవి మేధస్సులో కలుగుతున్నాయి
ప్రతి జీవికి జీవిత కాలంలో కలిగే భావాలు కూడా నాలో ఓ క్షణంలోనే కలుగుతాయి
విశ్వమున జరిగే ప్రతి కార్యం నాలో ఓ క్షణంలోనే ఆనాడే భావనగా కలిగి ఉన్నాయి
నా మేధస్సులో లేని భావన ఇక ఏనాడు ఎవరికీ కలగని విధంగా ఆనాడే నాలో ఓ క్షణాన కలిగాయి

Monday, September 6, 2010

క్షేమమా మీ భావాలు కుశలమేనని

క్షేమమా మీ భావాలు కుశలమేనని నా భావన
ఎవరు ఎక్కడున్నా కాల విజ్ఞానమే జీవితాలను కలుపుతుంది
అజ్ఞానమే జీవితాలను అనర్థకంగా మార్చుతుంది
మంచి భావాలతో జీవించే వారికి కాలం శుభోధయమే
ఇట్లు కాల భావాల సమయాలోచనతో మీ దివ్య స్పూర్తిని

జీవితాలు కలుషితమైతే బంధాలు

జీవితాలు కలుషితమైతే బంధాలు విచ్చలవిడిగా అల్లుకుంటాయి
అజ్ఞానంగా అల్లుకుంటే జీవితాలకు అర్థాలు తెలుపుటకు ఉండవు
అనుభవం లేకుండా జీవితాలు అల్లుకుపోతే బంధాలు మారిపోతాయి
ఎవరికి ఎవరు బంధమో ఎవరిది గొప్ప జీవితమో తెలుపలేము
బంధాల జీవితాకు ఓ దారి వరుస వంశము లేక ఎక్కడెక్కడో అల్లికలు
అల్లికలు తారుమారైతే భావాలకు రూపాలకు పొంతన కొన్నైనా ఉండవు

విశ్వమా నీ మనస్సు ఎక్కడున్నా

విశ్వమా నీ మనస్సు ఎక్కడున్నా నేను నీలోనే అన్వేషిస్తున్నా
నీలోని భావాలను అద్భుత రూపాల నుండి నిత్యం గ్రహిస్తున్నా
ఆనాటి నుండి నేటి వరకు భావాలను గ్రహిస్తున్నా ఎన్నో మిగిలిపోయాయి
నీలో కొత్త భావాలు ఆగిపోవు నా మేధస్సులో చేరే భావాలు ఆగిపోవు

శ్వాసలో భావన ఆగిపోయేలా ధ్యానిస్తే

శ్వాసలో భావన ఆగిపోయేలా ధ్యానిస్తే విశ్వ కమలం మేధస్సున ఉదయిస్తుంది
శ్వాసను ఏకాగ్రతగా గమనించుటలో విశ్వము నీలో లీనమై చైతన్యమవుతుంది
శ్వాసలో ప్రాశాంతమైన దీర్ఘ కాల గమనమే ధ్యానముగా సాధన మొదలవుతుంది
ధ్యాన సాధనలోనే మనస్సు నిశ్చలమై ఆత్మ ఉత్తేజమై విశ్వ శక్తిని స్వీకరిస్తుంది
భావన ఆగిపోవుటలో ఆలోచనలు కూడా ఆగిపోయి ఏకాగ్రత శ్వాసపై ఉంటుంది

ఆలోచనలను అన్వేషణతో విశ్వమున

ఆలోచనలను అన్వేషణతో విశ్వమున వదిలేస్తే మర్మ రహస్యాలు తెలియును
జీవ రహస్యాలు కూడా సూక్ష్మ భావాలతో మేధస్సుకు తెలుస్తూనే ఉంటాయి
స్వార్థం ఆశ అజ్ఞానం లేకుండా జీవించే వారికి విశ్వ విజ్ఞానం మేధస్సులోనే ఉంటుంది
గొప్ప భావాలతో జీవించే వారికి కాలం ఎప్పుడూ మహా విషయాలనే తెలుపుతుంది

బంధాలను తెంచుకొని ప్రేమ స్నేహాన్ని

బంధాలను తెంచుకొని ప్రేమ స్నేహాన్ని మరచిపోయి నీతి
గౌరవాన్ని పోగొట్టుకొని స్థానం రూపాన్ని మార్చుకొని భావం
ఇలా ఎన్నో వదులుకొని సృష్టికి విరుద్ధంగా ఎన్నడూ జీవించవద్దు
అర్థం కాకుండా జీవిస్తూపోతే పంచభూతాలు కూడా నిన్ను వదిలిపోతాయి

శ్వాస ఆగిపోతే మనస్సు ఏ స్థానమున

శ్వాస ఆగిపోతే మనస్సు ఏ స్థానమున ఎక్కడ ఎలా ఏ భావనతో ఆగిపోతుంది
శ్వాస ఆగిపోయే భావన మేధస్సుకు తెలుస్తుందా ఎలా శూన్యమవుతుంది
శ్వాసకు మనస్సుకు ఎటువంటి సంబంధము ఉన్నది ఎలా జీవించగలిగాయి
శ్వాసతోపాటు మనస్సు ఆత్మ మూడు శరీరాన్ని వదిలి ఎక్కడికి పోతాయి
శ్వాస జీవముగా మనస్సు చలనముగా ఆత్మ రూపముగా మనలో ఉంటాయి
ఈ మూడా కలిస్తేనే మనలో భావన మొదలవుతుంది అలాగే జీవించగలుగుతాము
మూడింటిలో ఒకటి లేకున్నా శరీరము నిలవదు ఏ జీవి జన్మించదు

విశ్వమున ఆనాడు దాగిన రూపాలను

విశ్వమున ఆనాడు దాగిన రూపాలను త్రవ్వుతూ వస్తున్నారు
ఎన్నో మహా రూపాలు మారిపోయాయి ఎన్నో మరో రూపాలను సృష్టిస్తున్నారు
సహజ రూపాలను కృత్రిమ రూపాలుగా మార్చుకుంటూ వస్తున్నారు
విశ్వ రూపానికి ఎన్నో తగ్గులు ఎక్కడెక్కడో ఏర్పడుతున్నాయి
ఏ రూపం ఎలా చెదిరిన చివరికి మరల మట్టిలోనే కలిసిపోతుంది
చెదిరిపోయే రూపాల కోసం సహజంగా ఉన్న రూపాలను మార్చవద్దు
విశ్వ రూపాలలోని భావాలను ప్రశాంతంగా విజ్ఞానంతో గ్రహించి చూడండి
విశ్వాన్ని ఆర్థికంగా దోచుకోవద్దు ప్రకృతిని కనిపించకుండా చెయ్యొద్దు

నా ఆత్మలో ప్రతి అణువు యొక్క

నా ఆత్మలో ప్రతి అణువు యొక్క ఆత్మ సూక్ష్మ భావాలతో దాగి ఉన్నది
ఏ అణువును సృస్టించబడాలన్నా నా ఆత్మలో ఉన్న ఆత్మ భావన కావాలి
ప్రతి జీవిలోని కణాలు కూడా నా ఆత్మ భావాలలోని విశ్వ తత్వాన్ని కలిగి ఉంటాయి
విశ్వమున ఆత్మ పరిశుద్ధమైనప్పుడు ప్రతి అణువు ఆత్మ ప్రతి ఆత్మలో చైతన్యమవుతుంది

Sunday, September 5, 2010

*** జగతిలో ఎలా జీవించాలి!

జగతిలో ఎలా జీవించాలి! ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆచరించాలి
బాల్యమున తల్లిదండ్రులే శుభ్రతతో జీవించేలా పెంచాలి
శాఖాహార ఆహారంతో పాటు ప్రశాంతంగా నిద్రించేలా చూడాలి
మంచి మాటలు మంచి అలవాట్లు మంచి ప్రవర్తనతో పెంచాలి
ఎప్పటికీ చక్కని వస్త్రాలతో శరీరాన్ని శుభ్రతగా ఉంచుకోవాలి
క్రమ శిక్షణ ఏకాగ్రత వినయం విధేయతలకు అవగాహన కల్పించాలి
ఐదవ సంవత్సరం నుండి చదువు అలాగే ధ్యాన శిక్షణ ప్రారంభించాలి
లోకజ్ఞానం తెలుపుతూ పద ఉచ్చారణ మాట తీరు స్పష్టంగా ఉండాలి
స్నేహితులతో ఉన్నప్పుడు కూడా శుభ్రత మాట తీరు ఆటలు చక్కగా ఉండాలి
ఏ దురలవాట్లను బయట కల్పించనట్లు నేర్చుకోలేనట్లు భోధించాలి
పదహేను సంవత్సరాలు తల్లి దండ్రుల ఆధీనంలో మెలగాలి
పదహారవ సంవత్సరం నుండి చదువుతో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవాలి
ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి
ప్రతి రోజు వ్యాయామం చేస్తూ శరీర సౌష్టవాన్ని చక్కగా ఉంచుకోవాలి
ఆరోగ్యానికి ఎక్కువగా ఫలహారములు కూరగాయలు తీసుకోవాలి
ప్రతి పనిని సులువుగా చేసుకొనుటకు శరీరము అనుకరించాలి
మేధస్సును ఎప్పుడూ సోమరి లేకుండా ఉత్తేజంగా ఉంచుకోవాలి
ప్రతి కార్యాన్ని శుభ్రతగా కార్య కారణ విధానంతో చేయగలగాలి
మీ నుండి ఇతరులు ఎన్నో విషయాలను గ్రహిస్తూ నేర్చుకోవాలి
ఎవరికి తెలియని కొత్త విజ్ఞానాన్ని సూక్ష్మంగా పరిశీలించి కనుక్కోవాలి
సూర్యోదయ సూర్యాస్తములను చంద్రున్ని నక్షత్రాలను ఆకాశాన్ని మేఘాల ఆకృతులను తిలకిస్తూ ఉండాలి
ప్రతి జీవి జీవించే విధానాన్ని జీవిత రహస్యాలను తెలుసుకుంటూ ఉండాలి
ఆకాశంలో పక్షుల విహారాలను ఎన్నో విధాల గొప్పగా తిలకించాలి
ఎలా కష్టపడితే మన జీవితం అలా మలుపు తిరుగుతూ మహా గమ్యాన్ని చేరుకోవాలి
సామాన్య మానవుడిలా కాకుండా గొప్ప ఆధ్యాత మహాత్మలా విశ్వమున నిలిచిపోవాలి
ధ్యాన సాధన పెంచుతూ చదువుకుంటూనే మంచి భవిష్య ప్రణాళికలతో ఎదగాలి
ఎన్నో ప్రయాణాలను చేస్తూ అన్ని ప్రాంతాల మనుషులను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి
గొప్ప వాళ్ళ జీవితాలను చరిత్రను శాస్త్రీయ శాస్త్రవేత్తలను గురించి అనుభవాన్ని గ్రహించాలి
మంచి ఆధ్యాత్మక అనుభవ సాంకేతిక సమాజ స్థితి పుస్తకాలు చదువుతూ ఉండాలి
ప్రపంచం నలుమూలల జరిగే విషయాలను సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి
అవసరంలేని వాటిని త్వరగా వదులుకునేలా ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి
మంచి కార్యాలపై పట్టుదల ఓపిక సమయస్పూర్తి కృషి అనుభవ విజ్ఞానం ఉండాలి
సందేహాలను గొప్పవాళ్ళను గురువులను అడుగుతూ ప్రయోజనం చెందాలి
కోప ద్వేషాలు అసూయ ఇలాంటివి లేకుండా అందరితో కలిసిపోయేలా జీవించాలి
ముప్పై సంవత్సరాల లోపు పెళ్లి పిల్లలు ఇతర కుటుంబ సమస్యలను క్రమ పరచుకోవాలి
మన పిల్లలను కూడా ఇదేవిధంగా పెంచుతూ స్నేహా సంబంధాలను ధృడ పరచుకోవాలి
ఇటు పిల్లల భవిష్యత్ అటు మన భవిష్యత్ ను అర్థం చేసుకుంటూ జీవించగలగాలి
అజ్ఞానానికి అనర్థాలకు ఆవేశాలకు చాలా దూరంగా ఉండేలా ఎరుకతో ఉండాలి
నలభై సంవత్సరాల తర్వాత విశ్వ విజ్ఞానం కోసం అన్వేషణ చేస్తూ ఉండాలి
ప్రకృతిని ఆకాశాన్ని పరిశీలిస్తూ అవగాహన చేస్తూ విశ్వ భావాలను సేకరించాలి
దేనిని దుర్వినియోగం చేయక అవసరమైన వాటినే సమకూర్చుకోవాలి
ప్రతి వస్తువుకు ప్రకృతికి విలువను ఇస్తూ వాటిని రక్షిస్తూ ఉండాలి
ప్రతి దాని యొక్క ఉపయోగాలను ఇతరులకు తెలుపుతూ ఉండాలి
లోకంలో జరిగే అద్భుతాలను గ్రహిస్తూ ఎన్నో భావాలను గ్రహిస్తూ ఉండాలి
ఎన్నో చరిత్రలను శాస్త్రవేత్తల జీవితాలను రాజ్యాంగ హక్కులను తెలుసుకోవాలి
ధ్యాన సాధనమున ఎన్నో విషయాలను పరిశీలించి విశ్వ రహస్యాలను తెలుసుకోవాలి
యాబై సంవత్సరాల తర్వాత పిల్లలకు మంచి ఉద్యోగం జీవిత లక్ష్యాన్ని కల్పించాలి
పెళ్ళిళ్ళు చేసి మంచి జీవితాన్ని ఆరంభించేలా చూసి వారి పిల్లలకు ఆదర్శం కావాలి
అరవై సంవత్సరాల తర్వాత చిన్న కార్యాలను చేసుకుంటూ సమాజానికి సేవలను అందించాలి
సమాజంలో మంచి మార్పు ఆధ్యాత్మ లక్షణ భావాలను నెలకొల్పాలి
సమాజలో ఏర్పడే సమస్యలకు పరిష్కారాన్ని తెలుపుతూ ఉండాలి
భవిష్యత్ కు ఉపయోగపడేలా క్రమ కారణ కాల ప్రణాళిక ను సమాజానికి తెలపాలి
శక్తి తక్కువయ్యే కొద్ది విశ్రాంతి తీసుకుంటూ ప్రకృతిని ఆశ్వాదిస్తూ ఉండాలి
రోగాలను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి లేదంటే వదిలించుకునే శక్తిని కోల్పోతాము
రోగానికి తగిన ఆహారమే భుజించాలి వేటిని రుచించినా రోగము వీడదు
మన ఆశయాలను జీవన జీవిత విధానాన్ని ఆస్తులను గొప్ప విషయాలను మన వాళ్లకు తెలపాలి
భార్య ఐతే భర్తతో భర్త ఐతే భార్యతో ఒకరు లేనప్పుడు ఎలా జీవించాలో చర్చించాలి
మనం చనిపోతే భవిష్యత్ సమస్యలకు ఎవరిని కలవాలో పిల్లలకు తెలపాలి
ధైర్యంగా జీవించాలని మన వాళ్లకు మనమే సూచనలను జాగ్రత్తలను తెలపాలి
ప్రయాణాలను తగ్గిస్తూ ధ్యానము చేస్తూ ఆరోగ్యంగా సుఖంగా మరణించాలి
మూడ నమ్మకాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా విశ్వ విజ్ఞాన ధ్యాన బాటలో జీవితాన్ని సాగించాలి
విశ్వమున ప్రతి ఒక్కరు సుఖంగా జీవించి చైతన్యం కావాలనే నా విశ్వ భావన
జనాభ అధికమవరాదు అజ్ఞానం అనర్థం కలగరాదు జీవితాలు చెదిరిపోరాదు

నా మేధస్సులో ప్రతి జీవి మేధస్సు

నా మేధస్సులో ప్రతి జీవి మేధస్సు సూక్ష్మ భావాలతో దాగి ఉన్నది
ప్రతి జీవి ఆలోచనలు నా మేధస్సుకు చేరుతూనే ఉంటాయి
ఏ జీవి ఆలోచించాలన్నా నా భావాలే మేధస్సుకు చేరాలి
ప్రతి జీవిలో కలిగే ప్రతి ఆలోచన నా మేధస్సులో ఎప్పటికి ఉంటుంది

జ్ఞానాన్ని మేధస్సులో జ్ఞాపకంగా

జ్ఞానాన్ని మేధస్సులో జ్ఞాపకంగా జ్ఞాన పరచండి
మరిచిపోవుటలో ఆలోచన విధానాన్ని గమనించండి
ఆలోచనల ఏకాగ్రతతో విషయ విజ్ఞాన అర్థాన్ని గ్రహించండి
ముఖ్యమైన వాటిని అప్పుడప్పుడు నెమరువేయండి
నెమరు వేయుటలో ఎరుకతో ఆలోచిస్తే జ్ఞాపకంగా ఉంటుంది
విషయాన్ని అర్థంగా తెలుసుకున్నప్పుడే జ్ఞాపకంగా ఉంటుంది
ఆలోచనలు విషయాన్ని విజ్ఞాన అర్థంగా గ్రహించలేనప్పుడే జ్ఞాపకంగా ఉండవు

విశ్వాసాలోచన అనగా పరమార్థం

విశ్వాసాలోచన అనగా పరమార్థం ఏమిటి
విశ్వము విశ్వాసము శ్వాస ఆలోచన
నాలుగు పదాల మహా గుణ భావ కలయిక
విశ్వమున విశ్వాసముతో శ్వాసలో కలిగే ఆలోచన
ఇలాంటి పదాలు అరుదుగా లభిస్తాయి
భాషా ప్రద ప్రావీణ్యం ఉంటేనే ఇలాంటి పదాలు
గుణాలను పదాలలో అర్థాలుగా దాచినట్లు పరమార్థాన్ని మేధస్సున జ్ఞాన పరచండి

నాలో ప్రతి భావనను విశ్వమే

నాలో ప్రతి భావనను విశ్వమే కలిగిస్తూ తెలుపుతుంది
మాట్లాడాలన్నా ఆహారాన్ని తీసుకోవాలన్నా నిద్రించాలన్నా
భావనగా నాలో ఆలోచనలు విశ్వమే మేధస్సున కలిగిస్తుంది
ఓ క్షణం విశ్వ భావనను గ్రహించిన తర్వాతే కార్యం చేయగలుగుతాను
భావనగా నిలిచి పోవుటకు విశ్వమే సహకరిస్తుందని నా విశ్వాసాలోచన

Saturday, September 4, 2010

ఓ విజ్ఞాని! ప్రయాణాన్ని విశ్వమున

ఓ విజ్ఞాని! ప్రయాణాన్ని విశ్వమున ఏ దిక్కున సాగిస్తావు
ప్రాపాంచిక సమాజమా ఆధ్యాత్మ జీవితమా నిర్ణయించుకో
ఇరువైపులా సమానత్వంతో జీవించగలిగితే గొప్పవాడివి
సమాజమున జీవిస్తూ విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించు
మానవుడిగానే నీలో మాధవుని గుణాలను సమాజానికి తెలుపు
నీ గుణాలు ప్రతి ఒక్కరిలో కలిగేలా ఎన్నో జీవితాలను తీర్చిదిద్దు
అందరి జీవితాలతో విశ్వమున సద్గుణ ప్రయాణాన్ని సాగించు
సద్గుణ భావమే మహా దిక్కుగా నీకు కాలమే సూచిస్తుంది

మీ కాలము నా భావనలతో సాగితే

మీ కాలము నా భావనలతో సాగితే సరి కొత్త జీవితానికేనని భావించు
నా భావాలు మీ జీవిత కాలములో సాగాలని అనుకుంటే శ్వాసనే గమనించు
విశ్వములో ఆకాశములా జీవించాలని నా భావాలు తెలుపుతూ ఉంటాయి
ఆకాశమే నీ జావితాన్ని మార్చునని నా భావాలు ఆకాశాన గుర్తొస్తాయి
మనిషిలో మార్పుకై శ్వాసలో విశ్వమే జీవిస్తుందని ఆకాశమే సూచిస్తుంది

నా భావాలు అర్థం కావాలంటే

నా భావాలు అర్థం కావాలంటే ప్రశాంతంగా శ్వాసను గమనించాలి
గమనంతో మీ శరీరంలో ఆత్మ తత్త్వం కలిగి విశ్వ భావన మొదలవుతుంది
విశ్వ భావనతో మీలో సద్గుణాలు ఆరంభమై సరికొత్త జీవితం ప్రారంభమవుతుంది
కొత్త జీవితంతో మీలో కలిగే భావాలే నా భావాలుగా అర్థమవుతూ తెలుస్తాయి
భావాలలో పరమార్థాన్ని గ్రహించినప్పుడు మీలో మహా ధ్యాస ఉద్భవించును
ధ్యాసను ధ్యానముగా గమనించి సాధన చేస్తే మీలో విశ్వము ఏకమవుతుంది
శ్వాసలో విశ్వము ఓ నూతన లోకాన్ని సృష్టించుకొని ఆధ్యాత్మ జీవితాన్ని సాగించును -
ఆధ్యాత్మ జీవితంలో అనుభవంతో ఎలా జీవించాలో కాలమే తెలుపునని గమనించు

శ్వాసలో విశ్వం ఉందనుకుంటే విశ్వ

శ్వాసలో విశ్వం ఉందనుకుంటే విశ్వ విజ్ఞానం నీ మేధస్సులో చేరుతుంది
విశ్వం నీ శ్వాసలో ఉందని నీవు గమనించినప్పుడే నీలో గమనం కలుగుతుంది
నీ శ్వాసను ఎంతగా గమనిస్తే నీ మేధస్సులో అంతటి విజ్ఞానం చేరుతుంటుంది
నీ శరీరంలోని ప్రతి అణువును గమనిస్తే నీలో శ్వాస నక్షత్ర కాంతితో జీవిస్తుంది
గమనమే ప్రయాణం అందులో విజ్ఞానం అదే విశ్వ భావం జీవిత గమ్యం జీవనం
విశ్వ విజ్ఞానంతో జీవించే నీవు ఆధ్యాత్మ భావాలతో విశ్వముననే నిలిచి ఉంటావు

నక్షత్రాన్ని తిలకిస్తుంటే నీకు మరో

నక్షత్రాన్ని తిలకిస్తుంటే నీకు మరో మహా రూపం గుర్తుకొచ్చిందా
నక్షత్రం కన్నా గొప్పగా ఆ మహా రూపంలోని లక్షణాలు ఏవి
విశ్వమున నక్షత్రము కన్నా గొప్పది తిలకించే విధానాలలో ఉండవచ్చేమో
ఇంద్ర ధనుస్సు మహా గొప్పదైనా నక్షత్ర వర్ణాలలో దాగిన మహా భావమే
నక్షత్రాన్ని తిలకించుటలో అనేక మహా రూప భావాలు అందులోనే కలుగుతాయి
నక్షత్రాన్ని ఎంత కాలం తిలకిస్తే అంత గొప్పగా విశ్వ రూపాలన్నీ దర్శనమిస్తాయి
నక్షత్రమున సూర్య చంద్రుల ప్రకాశ భావాలు కూడా కలుగుతాయి
విశ్వమున ఏ నక్షత్రము మహా గొప్పగా మెరుస్తుందో అందులోనే నేను నిలిచివుంటా
నక్షత్రాన్ని తిలకించుటలో లీనమైతే మనం కూడా నక్షత్రమై జీవించవచ్చు

మనం అనుకున్నవాటి కంటే కాలం

మనం అనుకున్నవాటి కంటే కాలం కల్పించినవే అధికం
విశ్వ అణువులలో నేను ఒక అణువునై జీవిస్తున్నాను
ఒక అణువుగా నేను అనుకున్నది జరగాలంటే
మిగతా అణువులను నా ఆధిక్యతలో ఉంచుకోవాలి
మన చుట్టూ ఉండే అణువులు మన ఆధిక్యతలో లేకపోతే
మనం అనుకున్న వాటికి వాటి సహకారం లభించదు
ఒక్కో అణువు ఒక్కో లక్ష్యంతో జీవిస్తున్నందున
వాటికి మనం సహకరించము మనకు అవి సహకరించవు
ఒక్కో అణువుకు జీవిత ఆశయాలు ఎన్నో ఉంటాయి
జీవితమంతా ఆశయాలను నెరవేర్చుకోవాలనే తపిస్తుంటాయి
మన లక్ష్యానికి మన చుట్టూ ఉండే అణువుల ద్వారా ఆటంకము కలగరాదు
మనం గొప్ప భావాలతో ఉంటే మన చుట్టూ ఉండే అణువులు గొప్పగా ఉంటాయి
చుట్టూ ఉండే అణువులు గొప్పగా ఉన్నప్పుడే మన లక్ష్యానికి అవకాశం లభిస్తుంది
అవకాశమున్నప్పుడే ప్రయత్నిస్తే మన లక్ష్యం నెరవేరుతుంది జాగ్రత్త వహించండి
మనకు అవకాశం లేనప్పుడు మరో అణువుకు అవకాశం లభిస్తుంది
ఒక్కో అణువుకు ఒక్కో సారి అవకాశం లభిస్తూ లక్ష్యాలు నేరవేరుతూ ఉంటాయి
అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు ప్రయత్నాన్ని ఎప్పుడూ మానుకోవద్దు
మన లక్ష్యానికి అణువులు కాలం సహకరించేందుకు ప్రశాంతంగా ధ్యానించు

కాలానికి ముందే మర్మముగా ఎన్నో

కాలానికి ముందే మర్మముగా ఎన్నో వేల కోట్ల యుగాలుగా భావనతో జీవించాను
భావనకు స్వభావ శక్తి తత్త్వం కలిగి శూన్యమై ఓ కొత్త భావన ఆరంభమైనది
నేను ఆనాడు భావనగా జీవించిన కాలానికి ప్రమాణాలు గమనించలేనివి
ప్రస్తుత కొత్త భావనకై కాలాన్ని తెలుసుకొనుటకు ఎన్నో సృష్టించాను
సృష్టించుటలో విశ్వమై విజ్ఞాన ప్రమాణాలతో జీవుల జీవితాలు సాగిపోతున్నాయి
నేను జీవించినట్లు ఏ జీవికి జీవిత కాలం లేనందున నేటి వరకు కాల సమయమెంతో -
నేడు సాగుతున్న కాలం కన్నా ఆనాటి నా భావన జీవించిన కాల సమయమే అధికం -

ఓ శూన్యమా ఎక్కడ నుండి నీకు

ఓ శూన్యమా ఎక్కడ నుండి నీకు భావన కలిగింది
మర్మాన్ని జయించి శూన్యాన్ని తలచి ఉదయించావు
భావనతో క్షణాన్ని ఆరంభించి కాలాన్ని సృష్టించావు
భావ స్వభావాలతో విశ్వాన్ని సృష్టించి రూపమిచ్చావు
జీవులను కూడా సృష్టించి జీవితాన్ని కల్పించావు
మానవ మేధస్సుతో విజ్ఞానం సాంకేతిక రంగంతో ప్రయాణిస్తున్నది
భావనలతోనే ధ్యానించే మహా విజ్ఞానాన్ని నీ శ్వాసను గమనించుటలో తెలుస్తున్నది

మీరు తెలిపిన అభిప్రాయం నాకు

మీరు తెలిపిన అభిప్రాయం నాకు చాలా బాగున్నది
మీ లాంటి అభిప్రాయాల కోసమే ఎదురుచూస్తున్నాను
మీ అభిప్రాయాలను మరొకరికి ఎందరికో తెలుపగలిగితే
నాకు చేరవలసిన అభిప్రాయాలు చాలని చాలా ఉంటాయి
ఎన్నో వేల అభిప్రాయాల కోసమే ప్రతి క్షణం ఎదురుచూస్తున్నా
నా భావాలకు తెలుగు వారి అభిప్రాయమే నా శుభా కాంక్ష
ఇట్లు మీ సహకారం ఎందరి నుండో ఒకరి గమ్యానికి చేరుతుంది
విజ్ఞానం ఒకరిలో ఉంటే నశిస్తుంది ఎందరిలో ఉంటే జీవిస్తూనే ఉంటుంది
సహకార సమాచార అభిప్రాయం ఎందరికో అందుతూనే ఉంటుంది

ఏ ప్రభూ! జీవము భావము దేహమూ

ఏ ప్రభూ! జీవము భావము దేహమూ అన్నీ నీలోనే దర్శిస్తున్నాను
ఓ చక్రవర్తి ద్వి సూర్య చంద్రులు త్రీ మూర్తులు నాల్గు దిక్కులు నీలోనే
పంచ పాండవ సైన్యం అరిషడ్వర్గాలు సప్త సముద్రాలు అష్ట దిక్పాలకులు
నవ గ్రహాలూ దశ అవతారములు ఏకాదశ గుణాపతి ద్వాదశ అర్దనారీశ్వరము
త్రయోదశ వేదములు చతుర్దశ కాలములు పంచ భూతాలూ సమస్తము నీలోనే
విశ్వముగా నీలో అనంత ముఖ వర్ణాలతో ఆత్మ భావ స్వభావాలతో అణువులుగా
సూక్ష్మ తేజ నక్షత్ర ప్రకాశముతో చూసేందుకు పాతాళ ఆకాశము కలిసిపోయాయి
నీ దర్శనముతో నాలో విశ్వము జీవము భావము దేహములోనే ధ్యానిస్తున్నాయి
నా శ్వాసను ధ్యానింపజేస్తూనే నేను నీలో చైతన్యమై మహా భావంతో నిలిచి ఉంటా
ప్రతి జీవి ధ్యానించేలా నాలోని భావాలు విశ్వము నుండి మేధస్సుకు చేరగలవు

ఆకాశంలో జీవిస్తే ఇటు భూలోకం

ఆకాశంలో జీవిస్తే ఇటు భూలోకం అటు అంతరిక్ష విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు
ఆకాశంలో జీవించుటకు మనకు ఆధారం లేనందున భావాలతో జీవించాలి
భావాలతో ఆకాశాన్ని తిలకిస్తే మన విజ్ఞానము ఎదుగుతూ విశ్వ విజ్ఞానమవుతుంది
ఆకాశాన్ని అత్యంత ఉన్నతమైన భావాలతో తిలకిస్తే ఎటువంటి జ్ఞానమైనా తెలియును

Friday, September 3, 2010

ఆకాశం ఓ విజ్ఞాన తెరగా ఎప్పుడూ

ఆకాశం ఓ విజ్ఞాన తెరగా ఎప్పుడూ విజ్ఞానాన్ని తెలుపుతూనే ఉంటుంది
భావాలను తనదైన రీతిలో ఎన్నో వర్ణాలతో ఎందరికో కనిపించేలా చిత్రిస్తుంది
నీలి ఆకాశపు తెరగా నలుపు ఆకాశపు తెరగా ఎన్నో చూపిస్తూనే ఉంటుంది
ఎవరు చూస్తున్నారో ఎవరు భావాలను గ్రహిస్తున్నారో ఎవరికి అర్థమవుతుందో
ఆకాశపు అంచులలో కూడా సూర్య చంద్ర నక్షత్రాలను మహా గొప్పగా చిత్రీకరిస్తుంది
మేఘాలతో ఎన్ని భావాలను తెలుపుతుందో క్షణాలకు కూడా తెలియకున్నాయి
ఆకాశాన్ని చూస్తూ జీవిస్తే మేధస్సు గమనంతో విశ్వ విజ్ఞానం కలుగుతుంది
ఆకాశం నీకు గురువైతే అంతరిక్షం నీకు విజ్ఞానాన్ని మేధస్సున కలిగిస్తూ ఉంటుంది

విశ్వములో శబ్ద కాలుష్యం ఎప్పుడూ

విశ్వములో శబ్ద కాలుష్యం ఎప్పుడూ ఉంటుంది
ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక శబ్దాన్ని చేస్తూనే ఉంటారు
విశ్వములో జీవి ఉన్నంత వరకు శబ్దం కలుగుతూనే ఉంటుంది
ప్రతి జీవి శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసలు అల్ప శబ్దాన్ని కలిగిస్తాయి
మానవుడు చేసే శబ్దాలు ఎన్నో చెవికి కర్ణ కఠోరంగా ఉంటాయి
నేటి సాంకేతిక యంత్రాల శబ్దాలు ఎన్నో విధాల పని చేస్తూనే ఉంటాయి
శబ్ద కాలుష్యంతో పాటు విశ్వమున ఎన్నో రకాల కాలుశ్యములు జరుగుతున్నాయి

నీవు మంచివాడివైతే నీ మనస్సు

నీవు మంచివాడివైతే నీ మనస్సు గొప్పది నీ మేధస్సు ఉత్తమ విజ్ఞానమైనది
నీవు మంచివాడివి కాకపొతే నీ మనస్సు అజ్ఞానంగా చలిస్తూనే అన్వేషిస్తుంది
నీ యొక్క గుణాలను భావ విచక్షణ ప్రవర్తనలను నీ మనస్సే నిర్ణయిస్తుంది
మనస్సు గొప్పదైతే మానవుడే మాదవుడిగా మహాత్మాగా నిలిచివుంటాడు
మనస్సును మాయ చేసుకోవద్దు ఏదైనా విజ్ఞానంగా గ్రహించి సాగిపోవాలి

అమృతాన్ని ఆహారంగా సేవించినా

అమృతాన్ని ఆహారంగా సేవించినా దుర్వాసన అలవాట్లను మానుకోలేరు
నోటిలో ఎప్పుడూ నమలడం దుర్వాసన ప్రతి క్షణం కలుగుతూనే ఉండాలి
ఎందుకు తింటారో తాగుతారో గుంపులు గుంపులుగా దుర్వాసనలతోనే
మతి పోయేదాక తాగి పడిపోయి మురికి కాలువలలో నిద్రించేవారు ఎందరో
చెత్తగా ఉన్నా అక్కడే తాగడం పొగ వదలడం కలుషితంగా జీవించడం
మద్యం సేవించి ఆవేదన చెంది చెత్తగా మాట్లాడటం ఎన్నో అజ్ఞానకరం
ఇలాంటి వారు నరకంలో ఉన్నా మానలేరు మంచిగా జీవించలేరు
మేధస్సు అజ్ఞానకరమైన లోపంతో జనిమించినట్లు ఉంటుంది
అమృత రుచిని తెలుసుకోండి సమయాన్ని గొప్పగా ఉపయోగించుకోండి
సంగీతాన్ని వినండి ప్రకృతిని ఆశ్వాదించండి చిత్రాలను తిలకించండి
శ్వాసను గమనించండి ఆకాశాన్ని చూడండి ఆహార అమృతాన్ని భుజించండి
అజ్ఞాన దురలవాట్లతో జీవించే వారికి ఇక ఏనాటికి మానవ జన్మ రాకపోవచ్చు
మరణంలేని అమృతాన్ని సేవించినా దురలవాట్లు ఉంటే కాలమే మరణింపజేస్తుంది

ఓ ఆకాశమా విశ్వాన్ని ఎందుకు కప్పి

ఓ ఆకాశమా విశ్వాన్ని ఎందుకు కప్పి ఉన్నావు
విశ్వమున దాగిన ఎన్నో మహా రూపాలు కనిపించకున్నాయి
సూర్య చంద్రులు నక్షత్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి
మేఘావృత ఆకార రూప వర్ణాలు ఇంద్రధనుస్సు అప్పుడప్పుడు కనిపిస్తాయి
ఇతర గ్రహాలు నక్షత్రాల గుంపులు ఉపగ్రహాలు ఎందుకు కనిపించుటలేదు
ఇంకా ఏవేవి ఉన్నాయో మేధస్సుకు అర్థమగుటలేదు కంటికి కనిపించుటలేదు
ఏ లోకాలున్నాయో చెప్పుకునేందుకే ఉన్నాయని భావిస్తున్నామా ఊహాతీతమా
ఇంకా నా విజ్ఞాన మేధస్సు ఎన్నో తెలుసుకోవాలని విశ్వంలో అన్వేషిస్తూనే ఉన్నది
నీవు ఉన్నందువల్ల ఎదిగే జీవికి ఉపయోగమని గ్రహిస్తూ నిన్నే తిలకిస్తున్నా

నీ మనస్సుకు నచ్చింది నీ దగ్గర

నీ మనస్సుకు నచ్చింది నీ దగ్గర ఉందా
నీవు కోరుకున్నది నీ వెంట వస్తుందా
నీ కోసం ఏదైనా అద్భుతం జరిగిందా
నీవు ఆశించినది నీకు దక్కిందా
జీవించుటలో సుఖ సంతోషాలున్నాయా
విజ్ఞానం ఉన్నా దక్కించుకోలేనివి ఎందుకో

విజ్ఞానాన్ని మనస్సే మేధస్సులో

విజ్ఞానాన్ని మనస్సే మేధస్సులో అమర్చుతుంది
మనస్సే విజ్ఞానం కోసం విశ్వమంతా అన్వేషిస్తుంది
మనస్సే అన్ని భావాలను తిలకిస్తూ చలిస్తుంది
మనస్సే మనల్ని వివిధ రకాలుగా ఉంచగలుగుతుంది
మనస్సు ఎలా ఉంటే మన ప్రవర్తన అలా సాగుతూ ఉంటుంది
మనం ఎదిగే విజ్ఞానం కూడా మనస్సు పైననే ఆధారం
మనస్సే అజ్ఞానాన్ని కూడా కల్పిస్తుంది
ప్రతి కార్యాన్ని మేధస్సుతో ఆలోచించి పని చేయాలి
విజ్ఞానంగా మనం జీవించేందుకే మనస్సును గమనిస్తూ ఉండాలి

చనిపోవుటలో సహజమైన మరణం

రహదారి ప్రమాదాలకు ఆకాశ వాహనాల ప్రదాలకు ఎందరో
ఇతర జీవులు కూడా ఇలాగే ఎన్నో విధాల అజ్ఞాన మరణమే
నేటి ఆహారమున నిరోధక శక్తి లేక శరీరము అనారోగ్యంగా
కాల ప్రభావాలకు కుప్పలు కుప్పలుగా చనిపోతూనే ఉన్నారు
మానవునికి ఎంత విజ్ఞానం ఉన్నా సరైన ప్రణాళిక జాగ్రత్తలు లేవు
వినేవారు ఒకరైతే అర్థం చేసుకునేవారు ఇంకొకరు తెలిపేవారు మరొకరు
చికిత్సలో కూడా లోటుపాట్లు మనుషులలోని భావోద్వేగాలకు మరణించే వారెందరో
ఆత్మ హత్యలు యుద్దాలు కొట్లాటలు యంత్రములకు ఎందరో చనిపోతూనే ఉన్నారు
అధిక జన సంఖ్యతో జీవించుట ఎందుకు అనంత రకాలుగా మరణించుట ఎందుకు
సహజ మరణానికి మంచి జీవితానికి విశ్వ రక్షణకై ధ్యానించండి విజ్ఞానంగా ఎదగండి
అన్ని సమస్యలకు అధిక సంఖ్యయే కారణము అలాగే ధ్యానమే పరిష్కార మార్గము

ఆకాశాన ప్రతి అణువు ఓ

ఆకాశాన ప్రతి అణువు ఓ వర్ణముతో ఉంటే గుర్తించగలవా
నీ నేత్రమున అతి సూక్ష్మ కాంతి భావన కణాలు ఉన్నాయా
ఒక్కొక్క వర్ణముతో ఉండే ఆకాశము ఎంతటి ఛాయా చిత్రమో
ఆకాశాన భళారే చిత్రం విచిత్రం అద్భుతం అద్వితీయ ఆశ్చర్యం
ఏ చిత్రాన్ని ఎంతగా వర్ణించినా ఆకాశాన్ని వర్ణించుటలో అల్పమే
భావనతో నే చూసిన ప్రతి అణువు వర్ణాన్ని నా మేధస్సు నేత్రాన దాచుకున్నా
ఒక్కొక్క అణువు కూడా అనంత వర్ణాలతో మారుతున్నట్లు నా మేధస్సులో

శరీరాన్ని కాంతి తత్వం చేయుటయే

శరీరాన్ని కాంతి తత్వం చేయుటయే యుగాలుగా జన్మించే ఆత్మ ఆశయం
సంపూర్ణ విజ్ఞానాన్ని గ్రహించిన తర్వాత శరీరాన్ని కాంతి తత్త్వం చేసుకోవాలి
శరీరము ఓ నక్షత్ర ప్రకాశంగా మారే వరకు విజ్ఞానంగా ధ్యానించడమే లక్ష్యం
మేధస్సులో విశ్వ భావాలు ఉంటే శరీరము నిత్యమూ ప్రకాశిస్తూనే ఉంటుంది

నక్షత్ర కాంతులు దివ్య ప్రకాశములు

నక్షత్ర కాంతులు దివ్య ప్రకాశములు మన శ్వాసలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి -
మానవులంతా ధ్యానించ గలిగితే ప్రతి జీవి మేధస్సులో విజ్ఞాన తేజమే ప్రకాశిస్తుంది -
ధ్యానించుటచే శ్వాసలో విశ్వ భావన మొదలై ఆత్మ ప్రకాశ విశ్వ శక్తిని స్వీకరిస్తుంది -
కాంతితో జీవించే మానవునకు మరణం ఏ కాలానికి కలుగుతుందో యుగాలే అనుకుంటా -

స్వర్గాలు నీవెంటే ఉన్నాయి నీకు

స్వర్గాలు నీవెంటే ఉన్నాయి నీకు తోడుగా
స్వర్గంలో కూడా అజ్ఞాననే సాగుతుంటే
విజ్ఞానంగా నీవే అందరిని మార్చలేవా
విజ్ఞానమే స్వర్గమని మేధస్సున చూసుకోవా
భావాలతో విజ్ఞాన స్వర్గాన్ని తిలకించు

Thursday, September 2, 2010

భూమి చుట్టూ విశ్వము ఎలా

భూమి చుట్టూ విశ్వము ఎలా ఉన్నదో నీలో విశ్వము అలానే ఉన్నది
విశ్వమైన నీ శ్వాస చుట్టూ నీ శరీరము ఉన్నట్లే భూలోకం ఉన్నది
బ్రంహాండం చుట్టూ కూడా భూమి ఉందని విశ్వ నిర్మాణ మహా విశేషం
విశ్వ నిర్మాణములో ఆకశమే మహా అద్భుత విశిష్టత ద్వారము
విశ్వమున విలువైనవన్నీ ఆకాశముచే భద్రంగా దాచి ఉంచబడినవి
విశ్వ నిర్మాణాన్ని చిత్రిన్చాలేము ఆకాశ భావాలను తెలుపలేము

God didn't create the Universe

God did not create the universe: Hawking (MSN News : Sep 2nd, 2010)
London: British physicist Stephen Hawking has said that the creation of the universe was a result of the inevitable laws of physics and it did not need God's help.
In his latest book titled "The Grand Design", Hawking writes: "Because there is a law such as gravity, the universe can and will create itself from nothing. Spontaneous creation is the reason there is something rather than nothing, why the universe exists, why we exist."
He rejects Isaac Newton's theory that the universe did not spontaneously begin to form but was set in motion by God. He wrote in the 1988 book: "If we discover a complete theory, it would be the ultimate triumph of human reason -- for then we should know the mind of God."

----

For the Proof to follow the two basic procedures in my blog :
*Second - Everything knows (Jan 2010)
*How the Nature starts in Universe (Feb 2010)

ఆనాటి భావన ఏమిటో ఆ భావనకే

ఆనాటి భావన ఏమిటో ఆ భావనకే తెలియదు
ఆనాడు ఆనాటి భావన తప్ప ఏదీ లేదు
శూన్యమున ఆనాడు ఉదయించిన మొదటి భావనయే ఇది
కనిపించేది వినిపించేది అనిపించేది తోచేది ఏదీ లేదు
ఆ భావన తెలిసిన వాడిని నేనేనని నా మేధస్సున

విగ్రహాలను ఆలయమున

విగ్రహాలను ఆలయమున అమర్చుటలో గమనించిన విషయార్థమేమిటి
నీవు అలా నిటారుగా కూర్చొని కదలక శిల వలె ధ్యానించ వలేననేగా
ధ్యానించుటచే నీవు విశ్వమున అత్యంత విజ్ఞాన స్థానాన్ని పొందగలవు
విశ్వ విధాతగా నక్షత్ర ప్రకాషముచే నిరంతరం మెరుస్తూనే ఉండిపోగలవు

అజ్ఞాన కర్మ తొలగిపోవుటచే విశ్వ

అజ్ఞాన కర్మ తొలగిపోవుటచే విశ్వ చైతన్యములో కలిసిపోయా
శరీరము ఆనంద భావంతో తేలిపోయి ఆత్మ విశ్వాన్ని చేరినది
విజ్ఞాన భావాలతో నా కర్మ శూన్యమై ఆత్మ విశ్వానికి వెళ్ళింది
ఏ లక్ష్యం లేని ఆత్మ విశ్వ చైతన్యమై కాలంతో ప్రయాణిస్తున్నది

చిన్నప్పుడు చేసిన తప్పులన్నీ ఎవరు

చిన్నప్పుడు చేసిన తప్పులన్నీ ఎవరు క్షమించారు
నిన్నటి వరకు చేసిన తప్పులన్నీ ఎవరు క్షమించగలరు
నేటి నుండి చేసే తప్పులను ఎవరు క్షమిస్తారో
ఎవరికి తెలియని తప్పులైతే కాలమే శిక్షిస్తుంది
అజ్ఞాన మేధస్సుతో ఎంత కాలం జీవించినా నిరుపయోగమే
ఇంతవరకు చేసిన తప్పులన్నీ క్షమించలేనివైతే ధ్యానించండి

విశ్వంలో నీకు మరో సారి మానవ

విశ్వంలో నీకు మరో సారి మానవ జన్మ ఎవరిస్తారు
కర్మతో మరణించే ఆత్మకు మరో మానవ జన్మ లేదు
మరో జన్మలో జంతువో పక్షివో సూక్ష్మ జీవివో ఇతర ప్రాణివో
ఇతర జీవిగా కర్మను తగ్గించుకోగలిగితే మరల మరో జన్మలో అవకాశం
ఒక్కసారి విజ్ఞానం చెందిన తర్వాత కర్మను నాశనం చేసుకోలేకపోతే
మరల జీవితమంతా అజ్ఞాన కాలమైతే కర్మ పెరుగునే కాని జీవితాల జన్మలు చాలవు

విశ్వమున ఆలోచన ఎక్కడ నుండి

విశ్వమున ఆలోచన ఎక్కడ నుండి కలుగుతున్నదని చెవిలో కర్ణ బేరి అన్వేషణ
నేత్రములో ఉన్న వర్ణ కణాలకైనా ఆలోచనలు కనబడుతున్నాయనే అన్వేషణ
నాసికములో వాసన గుణమైనా పసిగడుతుందా అని శ్వాసతో అన్వేషణ
నోటి రుచులకైనా ఆలోచన తెలుస్తుందని నాలుక ఎదురు చూస్తూనే అన్వేషణ
జ్ఞానేంద్రియాలు ఎన్నో అన్వేషణలు చేస్తున్నా మేధస్సుకు ఎలా చేరుతుందో
విజ్ఞాన ఆలోచన ఎక్కడ నుండి కలుగుతుందని మేధస్సుకు ఇంకా ప్రశ్నార్థకమే
" మనస్సు యొక్క అన్వేషణలో ఆలోచన కలిగి మేధస్సుకు చేరుతుంది "
మనస్సు అన్వేషించే మార్గం విశ్వమున ఎలాగైనా ఎక్కడ నుండైనా కలగవచ్చు
జ్ఞానేంద్రియ విచక్షణలే కాక శరీర కణ భావాల పంచ భూతాల సైతం కలుగును
భావ మార్పులలో ఉన్న అర్థమే ఆలోచనగా మానవ మేధస్సులో జరిగే విజ్ఞాన ప్రక్రియ
మనస్సు లేనిది ఎదుగుదలలేని నిర్జీవ రూపముతో ఒకే భావన కలిగి ఉంటుంది

విశ్వమున మహా ఆత్మ స్వరూపాలు

విశ్వమున మహా ఆత్మ స్వరూపాలు ఏవి ఎక్కడున్నాయి
జనన మరణ కాలమే ఎరుగని రూపాలే విశ్వాత్మ స్వరూపాలు
గుణ భావాల జీవత్వంతో విశిష్ట శక్తితో నిత్యం జీవిస్తూ ఉంటాయి
ఏ జీవి సృస్టించలేని విధంగా ఏర్పడిన రూపాలే ఆత్మ స్వరూపాలు
పంచ భూతాల సూర్య చంద్ర నక్షత్ర గ్రహాల ప్రకృతి నిర్జీవములే విశ్వాత్మలు

Wednesday, September 1, 2010

విశ్వమున ఏ నక్షత్రాన్ని చూస్తూ

విశ్వమున ఏ నక్షత్రాన్ని చూస్తూ జీవిస్తున్నావు
ఎంతటి నక్షత్ర ప్రకాశము నీ శ్వాసలో చేరుతున్నది
వెన్న ముక్కలో నీ శ్వాస ఎంతటి శక్తితో వెలుగుతున్నది
నీ వెంతటి విశ్వ విజ్ఞానాన్ని మేధస్సున పొంది ఉన్నావు
విజ్ఞానములేని మేధస్సుకు విశ్వధ్యాన నక్షత్ర ప్రకాశమే అవసరం

విశ్వమున ఎవరు అక్కడ నా మాటలు

విశ్వమున ఎవరు అక్కడ నా మాటలు వినిపిస్తున్నాయా
మాట్లాడటం లేదే ఎందుకు శబ్దాన్ని చేస్తూ వెళ్ళిపోతున్నారు
పంచ భూతాల ఆత్మ విజ్ఞానులైతే ఆగండి నాతో మాట్లాడండి
మేఘాలలో మెరుపు కనబడుతున్నదేగాని మీరు కనిపించుటలేదు
అత్యంత ఉన్నత ఎత్తైన స్థానమున నిచియున్నా కనిపించుట లేదే
నక్షత్ర సూర్య చంద్ర గ్రహాలన్నీ కనిపిస్తున్నా మీ రూపం కనిపించుటలేదు
విశ్వమున ఏ రూపంతో ఎక్కడ ఎలా ఏ వర్ణంతో మెరుస్తూ ఉన్నారు
ఎందుకు నాకే మీ ధ్వనులు వినబడుతున్నాయి ఒక్కసారైనా కనిపించరా
మీ రూప దర్శనమునకై నా శ్వాసను మహా ధ్యాసతో గమనిస్తున్నా
ధ్యాసలో విశ్వమున ఏ రూపములేక నా రూపమే శ్వాసతో వినిపిస్తున్నది

నాలో ఆలోచనలు కాలాన్ని వృధా

నాలో ఆలోచనలు కాలాన్ని వృధా చేసేలా కలుగుతున్నాయి
విజ్ఞాన ఆలోచనలు సమన్వయ అవకాశాన్ని కల్పించకున్నాయి
విజ్ఞాన కార్యాలను చేయలేక నా భవిష్యత్ ఎమవుతుందోననే ఆలోచన
మహా ఆలోచనలు ఉన్నా కార్యాలను చేయలేక భావాలతోనే సాగుతున్నా
నా భావాలు ఆకాశాన మహా మేఘ కదలికల రూప వర్ణాలనే సృష్టిస్తున్నాయి