Monday, March 23, 2020

జీవితం ఎంత విలువైనదో జీవం తెలుపునా

జీవితం ఎంత విలువైనదో జీవం తెలుపునా
ఆరోగ్యం ఎంత వజ్రమైనదో దేహం తెలుపునా

(ఆరోగ్యం ఎంత అమూల్యమైనదో రోగం తెలుపునా)

ప్రదేశం ఎంత ప్రశాంతమైనదో స్వచ్ఛత తెలుపునా
ఆచారం ఎంత మహోన్నతమో యోగ్యత తెలుపునా

విశ్వం ఎంత ప్రభావమో పర్యావరణం తెలుపునా
జగం ఎంత ప్రమేయమో పత్రహరితం తెలుపునా
లోకం ఎంత యథార్థమో ప్రకృతవ్యయం తెలుపునా  || జీవితం ||

ప్రకృతినే పరిశోధించు ప్రకృతినే రక్షించు నిత్యం
ప్రకృతినే తిలకించు ప్రకృతినే శరణించు సర్వం

ప్రకృతినే అపేక్షించు ప్రకృతినే ఆశ్రయించు నిత్యం
ప్రకృతినే ఆదరించు ప్రకృతినే అనుసరించు సర్వం 

ప్రకృతియే పరమ ఔషధం ప్రకృతియే పరమ ఔన్నత్యం
ప్రకృతియే పరమ ఆరోగ్యం ప్రకృతియే పరమ ఆనందం 

ప్రకృతియే పరమ ప్రసాదం ప్రకృతియే పరమ ప్రజ్ఞానం
ప్రకృతియే పరమ సౌలభ్యం ప్రకృతియే పరమ సౌజన్యం  || జీవితం ||

ప్రకృతినే స్మరించు ప్రకృతినే ధ్యానించు నిత్యం
ప్రకృతినే యోచించు ప్రకృతినే పూజించు సర్వం

ప్రకృతినే నడిపించు ప్రకృతినే సాగించు నిత్యం
ప్రకృతినే గమనించు ప్రకృతినే వృద్ధించు సర్వం

ప్రకృతియే పరమ ప్రశాంతం ప్రకృతియే పరమ ప్రధానం
ప్రకృతియే పరమ స్వచ్ఛతం ప్రకృతియే పరమ సంతోషం

ప్రకృతియే పరమ శాస్త్రీయం ప్రకృతియే పరమ శాస్తృత్వం
ప్రకృతియే పరమ సిద్ధాంతం ప్రకృతియే పరమ సంబంధం  || జీవితం || 

No comments:

Post a Comment