Monday, March 2, 2020

సూర్యుని కిరణాలకు కర్మ నశించునా

సూర్యుని కిరణాలకు కర్మ నశించునా
సూర్యుని ప్రకాశాలకు కర్త లయించునా
సూర్యుని ప్రభావాలకు క్రియ హరించునా

సూర్య భావ ప్రతాపాలకు జీవం అధిగమించునా
సూర్య తత్వ ప్రమేయాలకే రూపం ఆవహించునా  || సూర్యుని ||
 
సూర్యోదయ కాంతము మహా దివ్య భోగ కళ్యాణమా
సూర్యోదయ శాంతము మహా దివ్య భాగ్య కైవల్యమా
సూర్యోదయ ప్రాంతము మహా దివ్య యోగ బాంధవ్యమా  || సూర్యుని ||

సూర్యోదయ కాంతము కర్మను అనుభవించు మహా దివ్య విజ్ఞానమా
సూర్యోదయ శాంతము కర్తను అభిమానించు మహా దివ్య సుజ్ఞానమా 
సూర్యోదయ ప్రాంతము క్రియను అనుసంధించు మహా దివ్య ప్రజ్ఞానమా  || సూర్యుని ||

No comments:

Post a Comment