Thursday, March 5, 2020

ఇదే మంత్రం మనస్సులో ధ్వనించే

ఇదే మంత్రం మనస్సులో ధ్వనించే
ఇదే తంత్రం మేధస్సులో శృతించే

ఇదే యంత్రం దేహస్సులో స్వరించే
   
ఇదే గాత్రం శిరస్సులో శోధించే
ఇదే మర్మం వయస్సులో వీక్షించే

మహా గీతంలో కూడిన మంత్రమే తంత్రం అదే మర్మ గాత్రం చేసినదే దేహ యంత్రం  || ఇదే మంత్రం ||

మంత్రమే మహా శాస్త్రమా మహోదయ ధ్యాస భావమా
తంత్రమే మహా సూత్రమా జీవోదయ శృతి సంబంధమా

యంత్రమే మహా సిద్ధాంతమా ఉషోదయ ద్యుతి ధ్యానమా
గాత్రమే మహా సాధనమా దివ్యోదయ సమయశ్రమ సహనమా 

మర్మమే మహా పరిశోధనమా పూర్వోదయ కార్య కారణమా
చిత్రమే మహా పరిభ్రమణమా పూజ్యోదయ ప్రయాణ తీరమా  || ఇదే మంత్రం ||

మంత్రమే మహా జ్ఞానం మహోదయ విశ్వ విజ్ఞానం
తంత్రమే మహా వేదం జీవోదయ జీవకణ బోధనం

యంత్రమే మహా రూపం ఉషోదయ నిరంతర భ్రమణం
గాత్రమే మహా స్వరాగం దివ్యోదయ నిత్యంతర చరణం

మర్మమే మహా జీవం పూర్వోదయ కార్య సంయోగం
చిత్రమే మహా దేహం పూజ్యోదయ పరమాణు భోగం   || ఇదే మంత్రం || 

No comments:

Post a Comment