Monday, March 2, 2020

కాలమా నీకు లేని భాగ్యం ఏది

కాలమా నీకు లేని భాగ్యం ఏది
కాలమా నీవు లేని యోగం ఏది
కాలమా నీతో లేని భోగం ఏది

కర్మను అనుభవించుట నీకు భాగ్యమా
కర్తను అభిమానించుట నీకు యోగమా
క్రియను అనుసంధించుట నీకు భోగమా

కాలంతో సాగే జీవ కార్యములే భోగ భాగ్య యోగముల భవ సంగమమా 
కాలంతో సాగే విశ్వ కార్యములే స్వర జీవ విధముల గంగా ప్రవాహమా  || కాలమా ||

కాలమే కర్మను అనుగుణంగా అనుభవించునా
కాలమే కర్తను అనుకూలంగా అభిమానించునా
కాలమే క్రియను అనుగ్రహంగా అనుసంధించునా

కాలమే కార్యాన్ని కర్మ కర్త క్రియలతో అనువదించునా  || కాలమా ||

కాలమే కర్మను అనుకరణంగా అనుభవించునా
కాలమే కర్తను అనుచరణంగా అభిమానించునా
కాలమే క్రియను అనుతర్షణంగా అనుసంధించునా

కాలమే కార్యాన్ని కర్మ కర్త క్రియలతో అనుసరించునా  || కాలమా ||

No comments:

Post a Comment