Friday, March 20, 2020

ఆరోగ్యమా ఆనందమా

ఆరోగ్యమా ఆనందమా
అపురూపమా అపూర్వమా

ఆదర్శమా ఆచరణమా
ఆశ్రయమా ఆద్యంతమా

అనుబంధమా అనురాగమా
అభ్యుదయమా అనుభవమా

జగతిలో జీవించు జీవితం మమతాను రాగాల మహోన్నతం
విశ్వతిలో స్మరించు జీవితం మమకార భావాల మహోత్సవం  || ఆరోగ్యమా ||

స్వచ్ఛతగా జీవించు నీ జీవం జగద్గురు రూపం
స్వచ్ఛతగా భుజించు నీ దేహం జగన్మాత తత్త్వం

స్వచ్ఛతగా స్మరించు నీ ధ్యానం జగపతి భావం
స్వచ్ఛతగా శోధించు నీ వేదం జగజ్జ్యోతి కాంతం

స్వచ్ఛతగా శాంతించు నీ బోధం జగదీశ గీతం
స్వచ్ఛతగా స్పందించు నీ వాక్యం జగన్నాథ సూత్రం

ఆనందమైన ఆరోగ్యమునకై నిత్యం స్వచ్చతతో మేల్కొనవా మహోదయ  || ఆరోగ్యమా ||

స్వచ్ఛతగా కీర్తించు నీ కంఠం విశ్వాంమృత గానం
స్వచ్ఛతగా ప్రార్థించు నీ శ్లోకం విశ్వాంధర స్తోత్రం

స్వచ్ఛతగా సూచించు నీ భాష్యం విశ్వాంకృత గుణం
స్వచ్ఛతగా ప్రాప్తించు నీ వరం విశ్వాంభువ చంద్రం

స్వచ్ఛతగా ప్రేమించు నీ దైవం విశ్వాంచర కార్యం 
స్వచ్ఛతగా హర్షించు నీ మౌనం విశ్వాంకర దృశ్యం

ఆయుష్యమైన ఆరోగ్యమునకై సర్వం స్వచ్చతతో జ్ఞానించవా మహాకర  || ఆరోగ్యమా || 

No comments:

Post a Comment