Monday, March 30, 2020

నాలోని భావనయే ఒక శక్తిగా ఉదయించునా

నాలోని భావనయే ఒక శక్తిగా ఉదయించునా
నాలోని తత్వనయే ఒక భక్తిగా అవతరించునా

నాలోని వేదమే ఒక సూక్తిగా సంభాషించునా
నాలోని జ్ఞానమే ఒక యుక్తిగా ఉద్భవించునా

నాలోని జీవమే ఒక ముక్తిగా పరిశోధించునా
నాలోని రూపమే ఒక రక్తిగా ప్రశాంతించునా

నా ప్రకృతి జీవితమే ఒక ఉక్తిగా అన్వేషించునా
నా ప్రకృతి జీవనమే ఒక వ్యక్తిగా ఆశ్రయించునా  || నాలోని ||

భావనలోని శక్తి ఒక ఆలోచనయేనని తెలిపెదనా
తత్వనలోని భక్తి ఒక ఆచరణయేనని తెలిపెదనా 

వేదంలోని సూక్తి ఒక సందేశమేనని తెలిపెదనా
జ్ఞానంలోని యుక్తి ఒక ప్రయోగమేనని తెలిపెదనా

జీవంలోని ముక్తి ఒక మార్గమేనని తెలిపెదనా
రూపంలోని రక్తి ఒక బంధమేనని తెలిపెదనా

ప్రకృతిలోని ఉక్తి ఒక భాషితమేనని తెలిపెదనా
ప్రకృతిలోని వ్యక్తి ఒక ఆధారమేనని తెలిపెదనా  || నాలోని ||

భావనలోని శక్తి ఒక ప్రారంభమేనని తెలిపెదనా
తత్వనలోని భక్తి ఒక ఆదర్శమేనని తెలిపెదనా 

వేదంలోని సూక్తి ఒక సారాంశమేనని తెలిపెదనా
జ్ఞానంలోని యుక్తి ఒక సామర్థ్యమేనని తెలిపెదనా

జీవంలోని ముక్తి ఒక గమ్యమేనని తెలిపెదనా
రూపంలోని రక్తి ఒక యోగ్యమేనని తెలిపెదనా

ప్రకృతిలోని ఉక్తి ఒక సుహితమేనని తెలిపెదనా
ప్రకృతిలోని వ్యక్తి ఒక సుధాతమేనని తెలిపెదనా  || నాలోని || 

No comments:

Post a Comment