Monday, March 30, 2020

వినిపించునా నా భావన నీ మనస్సులో ప్రభూ

వినిపించునా నా భావన నీ మనస్సులో ప్రభూ
స్పర్శించునా నా వేదన నీ శిరస్సులో ప్రభూ
స్పందించునా నా తత్వన నీ మేధస్సులో ప్రభూ 

ఇక ఇంకెవ్వరూ లేరురా ఈ జగతిలో
ఇక ఇంకెవ్వరూ రారురా ఈ విశ్వతిలో
ఇక ఇంకెవ్వరూ ఉండరూ ఈ లోకతిలో ప్రభూ ప్రభూ

ఇక మహా రోగంతో జీవించువారు ఎవరు లేరురా
ఇక మహా రోగంతో యోచించువారు ఎవరు రారురా
ఇక మహా రోగంతో స్మరించువారు ఎవరు ఉండరూ ప్రభూ ప్రభూ

నీ దైవ నిర్ణయంతో ఈ దుష్ట కాల సమయం వెళ్ళిపోయింది ప్రభూ ప్రభూ 
నీ దివ్య పరిశుద్ధంతో ఈ పూర్వ కాల వైభోగం అవతరించింది ప్రభూ ప్రభూ  || ఇక ||

ఏ నాటి కాలానికి చేరుకున్నా మన జీవన విధానం ఎప్పటికీ ఒకేలా ఉండాలి
ఏ నాటి తరానికి చెప్పుకున్నా మన జీవిత సాధనం ఎప్పటికీ ఒకేలా ఉండాలి

ఏ నాటి బంధాలను కలుపుకున్నా మన ఆచార విధానం ఎప్పటికీ ఒకేలా సాగాలి
ఏ నాటి యోగాలను తెలుపుకున్నా మన ఆశ్రయ గమనం ఎప్పటికీ ఒకేలా సాగాలి  || ఇక ||

ఏ నాటి రోజులను గడుపుకున్నా మన ఆహార నియమం ఎప్పటికీ స్వచ్ఛతగా ఉండాలి
ఏ నాటి వేళలను సహించుకున్నా మన విహార నిర్ణయం ఎప్పటికీ సంస్కృతిగా ఉండాలి

ఏ నాటి భావాలను పంచుకున్నా మన జీవన వైవిధ్యం ఎప్పటికీ ఉన్నతగా సాగాలి
ఏ నాటి తత్వాలను నేర్చుకున్నా మన జీవిత కర్తవ్యం ఎప్పటికీ స్పష్టతగా సాగాలి   || ఇక || 

No comments:

Post a Comment