ఏ జీవి లేనిచోటైనా లేదా నీతో ఉన్న వారితో మాట్లాడక ఆలోచిస్తేనే ఏకాగ్రత
నీలో నీవు నీ మేధస్సును నీ భావాలతో ఆలోచింపజేస్తే ఓ అవగాహన
అవగాహనతో పరిశీలిస్తే ఓ విషయాన్ని అర్థం చేసుకునే విధంగా ఆలోచనలో
ఆలోచనలను గత అనుభవాలతో మేధస్సులో విశదీకరిస్తే విజ్ఞానార్థంగా
ఎన్నో ఆలోచనలతో ఎన్నిటినో ఆలోచిస్తూపొతే ఎన్నో విషయాలు అర్థవంతంగా
మన మేధస్సులో ఎన్ని అర్థమైన విషయాలు ఉంటే అంతటి విజ్ఞానంగా
విశ్వ రహస్యాలను కదిలించే శక్తి మేధస్సుకు ఉందని అన్వేషణలో తెలియాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment