ఓ మహా రూపం మేఘములలో మెరుస్తున్నది కాని రూపము కనిపించుటలేదు
ఆకారాన్ని చూడలేని ఆ రూపాన్ని దర్శించాలని నా నేత్రమున ఓ దివ్య భావన
కనిపించని మెరిసే ఆ రూపం వజ్రము కన్నా గొప్ప వర్ణ కాంతులతో ప్రకాశిస్తున్నది
మేఘాలలో దాగిన ఆ మహా రూపం ఓ దివ్య కమలమై శిరస్సున చేరవలెనని
ఆ కాంతులు మేధస్సులో ఆకాశ సూర్య కిరణాలుగా తేజస్సుతో ప్రకాశించాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.
No comments:
Post a Comment