Wednesday, July 7, 2010

ప్రపంచ యుద్ధము జరగరాదని

ప్రపంచ యుద్ధము జరగరాదని విశ్వ విజ్ఞాన సమగ్ర సారాంశము
విశ్వమంతా మహా అణువులతో కూడినదని ప్రతీది విశ్వ జీవియేనని
మానవ మేధస్సు గొప్పతనం యుద్ధమునకు అవివేకమేనని అజ్ఞాన సారాంశము
ప్రతి జీవి తనలోని శ్వాస జీవియే నని ఆత్మ కర్మల సారంశ సందేశము
ఒక అణువు నుండి విశ్వము ఉద్భవించినట్లు ఒక తల్లి వేరు నుండే మానవ జాలము -
కాలక్రమేణ యుగాలుగా మానవ సమాజము వివిధ ప్రాంతాల నివాస బంధాలతో మార్పు చెందినది -
ప్రతి మానవుడు అందరికి దూర సమీప బంధుత్వ సంభందాలతో జీవిస్తున్నవాడే
కర్మాను సారం మేధస్సు విధాన స్థితి ప్రభావమున మానవ అజ్ఞానమే యుద్ధమునకు దారి తీయును -
యుద్ధమున మరణించు వారంతా బంధుత్వ సంభంద కరుణా మూర్తులేనని కన్నీటి నేత్ర శోకము -
యుద్ధమున పెద్దాయనలు చిన్నాయనలు సోదరులు మేనమామలు గురువులు మనవళ్ళు స్నేహితులు ఋషులు కవులు వైద్యులు మహా విజ్ఞానులే -
శ్వాస సంభందాలను రక్త పాతముతో తెంచరాదనీ పంచభూతాల ధర్మ శాస్త్రము
ఉన్నవాడు లేనివాడు అజ్ఞాన విజ్ఞానులు కలిసే జీవించాలని ఆత్మ జ్ఞాన విశ్వ సారంశము -
అంగవైఖల్యము కలవారు దీర్ఘ కాల రోగులు సమాజమున విజ్ఞానమునే సూచింతురు -
సుఖ దుఖ్ఖాలలో విజ్ఞాన ఎరుక ఉండాలనే మానవ మేధస్సు తెలుపుతుంది
కాలం ఎప్పుడూ అజ్ఞానాన్ని సూచిస్తుందని మానవుడే నిత్య విజ్ఞాన ధర్మనీతి సారాంశముతో ఎదగవలేనని సూచన -
విశ్వమున భయంకరాన్ని మానవులే యుద్ధముగా సృష్టిస్తే విశ్వకాలమే ఘోర ప్రళయాన్ని సృస్టించగలదు -
విశ్వమున నీకేది అర్థము కాకుంటే పరమార్థము తెలియుటకు ఆత్మ జ్ఞానము చెందాలని -
"మహాభారతము" తెలియకున్నను "విశ్వ భారతము" తెలియాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

No comments:

Post a Comment