కర్మను అభివృద్ధి చెందించూ
కర్మను అనుభూతి చెందించూ
కర్మను అపారంగా ఆశ్రయించూ
కర్మను అనంతంగా ఆహ్వానించూ
కర్మను అభిలాషగా అన్వేషించూ
కర్మను అత్యవసరగా ఆలోచించూ
కర్మతోనే జీవితం అమోఘ వైఫల్యం
కర్మతోనే జీవనం అమృత విఫలం || కర్మను ||
కర్మతో దేహం నిరంతరం శ్రమ యుక్తం
కర్మతో రూపం అనంతరం కృషి (సుఖ) ముక్తం
కర్మను వదిలించే సూత్రం ఏ మేధస్సులో నిక్షిప్తమో
కర్మను తొలగించే శాస్త్రం ఏ మనస్సులో సంక్షిప్తమో
కర్మను విడిపించే సిద్ధాంతం ఏ దేహస్సులో సాధ్యమో
కర్మను కదిలించే వేదాంతం ఏ వయస్సులో శక్యమో
కర్మతోనే కఠిన జీవితం భవిష్య కారణం
కర్మతోనే కఠోర జీవనం భవిష్య కారుణ్యం || కర్మను ||
కర్మతో జీవం నిరంతరం శ్రమ యుక్తం
కర్మతో జ్ఞానం అనంతరం కృషి (సుఖ) ముక్తం
కర్మను తరగించు మంత్రం ఏ ఉషస్సులో సంభవమో
కర్మను అరగించు తంత్రం ఏ అహస్సులో సౌలభ్యమో
కర్మను కరిగించు యంత్రం ఏ తేజస్సులో సులభమో
కర్మను రవిలించు మర్మం ఏ శ్రేయస్సులో సౌకర్యమో
కర్మతోనే కఠిన జీవితం భవిష్య కారణం
కర్మతోనే కఠోర జీవనం భవిష్య కారుణ్యం || కర్మను ||