Thursday, July 15, 2010

అజ్ఞానం కలుగుతున్న తక్షణంలో

అజ్ఞానం కలుగుతున్న తక్షణంలో మనస్సును కేంద్రీకరించు
మనస్సు మారుతున్న తక్షణమే విజ్ఞాన ఎరుకను గ్రహించు
కళ్ళు చూస్తున్నా మేధస్సుకు విజ్ఞానంగా తెలిసినా చేతులు చేసిన కార్య విధానమున
క్షణ కాలంలోనే మనస్సు మారి మేధస్సును మరిపించి మరో ధ్యాసతో తప్పు జరిగినది
క్షణంలో పూర్తి చేయవలసిన కార్యములలో తెలియని తప్పులెన్నో
మేధస్సు గ్రహించని తప్పులకు ఏకాగ్రత లేని మనస్సే కారణము
మేధస్సును కేంద్రీకరించుటకు విజ్ఞాన ఎరుక ముఖ్య ఆవశ్యకమే
మనస్సే మేధస్సు విజ్ఞానాన్ని మాయచేసి జీవితాన్ని మార్చుతుంది
తప్పు జరుగుటయే అజ్ఞాన కారణముగా తెలుసుకోవలసిన మహా నీతి
మనస్సును ప్రశాంతంగా సూక్ష్మ క్షణ కార్యములపై కేంద్రీకరించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!

No comments:

Post a Comment