మనస్సు మాయ చేసినా మేధస్సుకు తెలుస్తుంది
మేధస్సుకు తెలియకుండానే మనస్సు మాయ చేస్తుంది
మనస్సు మేధస్సును ఓ క్షణం మరో ధ్యాసలో ఉంచుతుంది
ఆ క్షణమే మనస్సు మారి మరో కార్యాన్ని ఆలోచిస్తుంది
మనస్సు మారినప్పుడే కార్యమున తప్పులు జరుగుతాయి
తప్పు జరిగిన తర్వాత మేధస్సు మనస్సు మార్పును గుర్తిస్తుంది
మేధస్సు ఏకాగ్రతను మార్చే శక్తి లేదా ధ్యాస మనస్సుకే ఉంది
మనస్సును కూడా మేధస్సుతో ఏకాగ్రతగా కేంద్రీకరించే శక్తి ఎరుకకే
ఎరుక కూడా విజ్ఞాన ధ్యాసతో ఉంటేనే మనస్సు కొంత కాలం ఏకాగ్రతతో
ఓ విజ్ఞాన కార్యానికి మనస్సు ఎకీభవిస్తేనే కార్యార్థం తెలియును
మన మేధస్సులో విజ్ఞాన ఎరుక దృడంగా ఎదగాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment