విశ్వతత్వ వేత్త జన్మించినా కాలం అజ్ఞానాన్నే సూచిస్తుంది
తత్వవేత్తలో ఆత్మజ్ఞానం కలుగుటకు విజ్ఞాన ఎరుక కావాలి
ఆత్మ జ్ఞానాన్ని భోధించే గురువులు విశ్వమున అరుదుగా
సమాజమున తల్లిదండ్రులు అందరిలాగే తమ కుమారుడని
సమస్యలతో సంసార జీవితమున జీవించాలనే కోరెదరు
విజ్ఞానంతో ఆత్మజ్ఞానం చెందినా తల్లిదండ్రులు పెళ్లి చేయాలనే
లేదంటే జీవితము కాదని అందరిలాగే జీవించాలని కోరెదరు
విశ్వ తత్వవేత్త జన్మించినా సంసారంతో జీవితం వ్యర్థమైతే
లోకమున ఆత్మజ్ఞాన పరమార్థం ఎవరికీ తెలియదనే నేను
తల్లిదండ్రులు ఆత్మజ్ఞానం చెందితేనే విశ్వతత్వ వేత్త ఆశయం
నెరవేరుతుందని లోకాన్ని మార్చగలడని అవకాశం కల్పించుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే విశ్వమా!
No comments:
Post a Comment