పరమాత్మా! నీ [మీ] రూపం కనిపించకున్నను నీ భావ తత్వాలు విశ్వంలోని ప్రకృతి ఆకార రూపాలతో తెలుస్తున్నాయి
ప్రకృతిలోని సహజమైన భావ తత్వాలు అనంతమై విశ్వ రూపాల విజ్ఞానమై మేధావుల మేధస్సులలో వివిధ పరిశోధనల ఏకాగ్రత గమనాలలో తెలుస్తున్నాయి
ప్రకృతిలో దాగివున్నా ఏ భావ తత్వాలైనా కాల సమయ కార్యాలతో మేధస్సు గ్రహించగలరు [ఏకాగ్రత గమనం దివ్యమైన ఆలోచన మేధస్సులో ఉండాలి]
కాలంతో సాగే సమయాలలో ఎన్నో భావ తత్వాలు అనంతమై మేధస్సుకు చేరుతున్నాయి విజ్ఞానాన్ని కలుగజేస్తున్నాయి అనుభవాలను అందిస్తున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment