Friday, February 21, 2025

మేధస్సులో కలిగే ప్రతి ఆలోచన అజ్ఞానంతోనే మొదలవుతుంది

మేధస్సులో కలిగే ప్రతి ఆలోచన అజ్ఞానంతోనే మొదలవుతుంది 

అజ్ఞానమైన ఆలోచనను భావ తత్వాలతో భాషతో అర్థంగా గ్రహించి కార్యాలను సాగించడమే విజ్ఞానం  

ఆలోచన అర్థంగా ఉన్నప్పుడే మనం ఉచ్చరించాలి చెప్పగలగాలి పలుకగలగాలి వ్రాయగలగాలి మాట్లాడగలగాలి సంభాషించాలి వివరించాలి 

ఆలోచనల విజ్ఞానాన్ని కూడా కాలం సమయం ప్రతి క్షణం అజ్ఞానంగా అనర్థంగా మార్చేందుకు మేధస్సులో వివిధ ఆలోచనల పర ధ్యాసతో మరుపును కలిగిస్తుంది - అందుకే మనం కొన్ని సందర్భాలలో నష్టపోతూ ఉంటాము - ఎందుకు అలా జరిగింది ఎందుకు ఆ ఆలోచన కలగలేదు - ఎందుకు అనుకున్న విధంగా జరగలేదు - ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా పొరపాటు జరిగింది - ఎవరు ఆలోచనను మళ్ళించారు - ఏ దృశ్యం ఆలోచనను మళ్ళించింది - ఇలా ఎన్నో నష్టాలతో ప్రమాదాలతో కార్యాలను సాగిస్తుంటాము 

అందుకే కార్యం ముగిసేంతవరకు ఫలితం అనుకున్నట్లు పొందేవరకు విజ్ఞానవంతమైన ఆలోచనలతో ఎరుకతో కార్యాన్ని ముగించాలి 

గొప్ప కార్యాలను విజయవంతం చేయడానికి మహా ధ్యాసతో కూడిన సాధన నైపుణ్యంతో ఎరుకతో ఉండాలి  

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment