రెండు మేధస్సుల ఆలోచనలు [విజ్ఞానం, కార్యక్రమాల విధానం, విచక్షణ స్వభావం, వివిధ భావ తత్వాలు సమానం కావు] ఎప్పుడూ సమానంగా ఉండవు ఐనను బంధంతో ముడివేసుకుని ఒక వయస్సులో కొత్త జీవితాన్ని సాగిస్తున్నాము
జీవితాన్ని సాగించుటలో కొన్ని అర్థం చేసుకుంటాం కొన్నింటిని పంచుకుంటాం కొన్నింటిని తెలుసుకుంటాం కొన్నింటిని గ్రహిస్తుంటాం కొన్నింటిని మరచిపోతుంటాము కొన్నింటిని నేర్చుకుంటాం కొన్నిటిని వదులుకుంటాం కొన్నింటిని సాదిస్తుంటాం కొన్నింటిని విచారిస్తుంటాం కొన్నింటిని పరిశోధిస్తాం ఇలా ఎన్నో రకాలుగా కలిసిపోతూ కొంత సమయం విడిపోతూ ఎన్నో విధాలుగా జీవిస్తాము
ఎవరి బంధం వారిదే ఏ బంధం ఇంకెవరి బంధంతో సామానం కాదు [సమానంగా ఉండదు] - బంధాల కాల సమయం కూడా అంతే
బంధాలు సంబంధాలుగా సాగుతూ కొత్త కొత్త జీవితాలుగా తరతరాలుగా ఎన్నెన్నో సాగుతుంటాయి
మానవులకే కాదు ఇతర జీవులకు కూడా కొత్త కొత్త బంధాలు తరతరాలుగా సాగుతున్నాయి
అన్ని బంధాలు అనుభవాలే - అన్నింటిని అనుభవిస్తూ విజ్ఞానంతో ముందుకు సాగుతూ [ఎన్నో జాగ్రత్తలతో] జీవించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment