ఇంతవరకు నీవు చదివింది వేరు ఇక నుండి నీవు తెలుసునేది వేరు
జరిగినదానికంటే జరగబోయే వాటిపై ఎక్కువగా దృష్టి ఉంచుతూ మనం సాగుతూ జీవించుటలో ఎన్నో కొత్త విధానాలు అపారమైన విజ్ఞాన మార్పులు అద్భుతమైన ఆశ్చర్యమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి
రోజు రోజుకు ఒక కొత్త విజ్ఞానం క్షణ క్షణానికి ఒక కొత్త అనుభవం గడియ గడియకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ వస్తాయి
ఎప్పుడు ఎలా ఏ విజ్ఞానం వస్తున్నా పోతున్నా మనకు జీవన విధానానికి అవసరమయ్యే ప్రజ్ఞానం మన మేధస్సులో మనం శ్రమించే కార్యక్రమాలలో ఉండాలి [ఆరోగ్యం విజ్ఞానం ప్రకృతి అభివృద్ధి పరిశుద్ధత పవిత్రత పరిశుభ్రతగా మన జ్ఞానం ముందుకు తరతరాల వారికి సాగాలి]
కాలం ఎంత వేగంగా సాగిపోతుందో ఏదీ తెలుసుకోలేని స్థితి స్థాయిలో ఉన్నచోటే ఉండిపోతావు
ప్రతి క్షణం విజ్ఞానం చెందుతూ వాటి ఉపయోగాలతో ముందుకు సాగుతూ కార్యక్రమాలతో అనుభవాలను గ్రహిస్తూ ప్రకృతి అభివృద్ధితో సమాజమంతా ఎదుగుతూ ఉండాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment