Friday, February 7, 2025

యుద్ధరంగంలో ఎవరికీ ఎవరు ఏమౌతామో తెలిసినా తెలియకున్నా పోరాడుతాము

యుద్ధరంగంలో ఎవరికి ఎవరు ఏమౌతామో తెలిసినా తెలియకున్నా పోరాడుతాము 

ఎవరికి ఏ బంధం ఉన్నా లేకున్నా ఏ పరిచయాలు ఎలా ఉన్నా లేకున్నా పోరాడుతాము 

ఎటువంటి భావ తత్వాలు లేకుండానే ఒకే విధమైన ఆలోచనలతో శతృవర్గమని పోరాడుతాము 

ఎదురుగా కనిపించే ప్రతి ఒక్కరు శతృవేనని విజయం కోసమే లక్ష్యంగా వివిధ రకాలుగా పోరాడుతాము  

ఎవరికి ఏమౌతోందోనని  ఏ కరుణా దయా గుణ స్వభావ తత్వములు లేకుండా శతృవులను ఓడించాలని పోరాడుతాము 

యుద్ధరణంలో ఆలోచించే సమయం లేదు అవగాహన చేసే సమయం కాదు అర్థానికి తెలియని పరమార్థం లేదు 

ఎదుటువారిని ఎదురించి దూసుకువెళ్ళే ధైర్య సాహసాలు శక్తి సామర్థ్యాలు ఉంటే ఎందరినైనా ఓడించగల ఆలోచన మేధస్సులో ఆయుధంగా ఉండిపోతుంది 

ఎవరి ఆయుధం వారికి రక్షణ ఎవరి ధైర్యం వారికి ప్రేరణ ఎవరి సమయం వారికి శ్రమయ సాధన ఎవరి ప్రయత్నం వారికి వీర లక్షణ  

యుద్ధంలో చిన్నవారైనా పెద్దవారైనా ఎవరికీ ఎవరు ఏమైనా ఒకే విధంగా ఎదుర్కోవడమే విజయ లక్ష్యం 

యుద్ధం ఆనాడు అస్తమించింది [ముగిసింది] నేడు సరికొత్త ప్రశాంతత ఉదయించింది 
ప్రశాంతతనే మనమంతా తరతరాలుగా సాగిస్తూ విజ్ఞాన భావ తత్వాలతో జీవించాలి 

ప్రతి సమస్యను సమన్వయంగా ఆలోచిస్తూ సమపాళలో పరిష్కారిస్తూ విజయాన్ని ప్రశాంతంగా చేరుకోవాలి 

మనమంతా మిత్రులం మనమంతా మానవ బంధువులం మనమంతా మహా విజ్ఞానులం మనమంతా సామాన్య శాస్త్రీయ ప్రకృతి విజ్ఞాన విశ్వ భావాల జీవ తత్వాల పరిశోధకులం నిరంతరం శ్రామికులం సమ జీవులం 

యుద్ధములలో మరణించిన వారందరికీ మహా అశ్రువులు అలాగే వారి కుటుంబాలకు మహోదయం కలగాలి జీవితం ప్రశాంతంగా సాగాలి 

-- వివరణ ఇంకా ఉంది!


No comments:

Post a Comment