Tuesday, February 4, 2025

ఎటువంటి మేధావులకైనా మహాత్ములకైనా మహానుభావులకైనా అప్పుడపుడు అజ్ఞాన భావ తత్వములు మేధస్సులో కలుగుతుంటాయి

ఎటువంటి మేధావులకైనా మహాత్ములకైనా మహానుభావులకైనా అప్పుడపుడు అజ్ఞాన భావ తత్వములు మేధస్సులో కలుగుతుంటాయి 

ప్రతి జీవిలో అజ్ఞాన విజ్ఞాన భావములు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటాయి 

ఆలోచనలు ఎప్పుడు ఎలా కలుగుతాయో మనం ఉండే ప్రదేశం పరిస్థితి ప్రయాణ మార్గంలో గోచరించే దృశ్యాలు  వివిధ సంభాషణల ద్వారా కార్యాల ద్వారా ఎన్నో రకాలుగా సంభవిస్తుంటాయి అలాగే అనేక విధాలైన అజ్ఞాన విజ్ఞాన భావ తత్త్వములు వివిధ సమయాలలో కలుగుతుంటాయి 

అజ్ఞానాన్ని వదులుకొని ధ్యాసను మళ్ళించుకొని విజ్ఞానం వైపు ధ్యాను సాగిస్తూ వివిధ కార్యాలతో నిమగ్నమై సాగిపోవాలి ఉన్నతమైన ప్రగతిని ప్రఖ్యాతను సాధించాలి  

జీవితమంతా విజ్ఞాన భావాలతో నడుచుకుంటే ఉత్తములుగా ప్రఖ్యాత చెందుతాము 

మన ఎదుగుదలతో పాటు మనం జీవించే విధానంలో కలిగే ప్రతి కార్యాన్ని విజ్ఞానంగా సమర్థించాలి

కుటుంబంలో సమాజంలో సంస్థలో స్నేహితులతో సంబంధాలతో వివిధ ప్రయాణాలతో వివిధ ప్రదేశాలలో అందరితో విజ్ఞానంతో శ్రద్ధగా ఓపికతో సమన్వయంతో సందర్భానుసారంగా కార్యాచరణను సమర్థించుకొని సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment