పిలిచి పిలిచి వచ్చి తెలుపకే మరణమా కాస్త సమయం ఆగలేవా
నీవు ఉన్నావని గుర్తు చేస్తూ పకరింపుతో వస్తున్నావా మరణమా
ఎన్నో కార్యాలతో ఎన్నో బంధాలను కలిగించి ఎందరినో సృష్టించి జీవిస్తున్న వారిలో నన్నే పిలిచెదవా
నా కార్యాలను సాగించక ఫలితం రాక [తెలియక] ముందే నన్ను నా వారి నుండి ఇలాగే ఇప్పుడే దూరం చేసెదవా
నా వాళ్ళతో నేను చెప్పుకునే ఎన్నో విషయాలు తెలుపక ముందే నీతో వస్తే వారి జీవితం నేను అనుకున్నట్లుగా సాగేదెలా
మరణమా మా జీవిత బంధాలను తెలుసుకొని మరణమై సరైన సమయానికే వస్తే నేను నీతో ప్రశాంతగా వచ్చేనుగా
మా కార్యాలకు సరైన శ్రమ ఫలితం కలిగించి కుటుంబాన్ని ఆరోగ్యాంగా విజ్ఞానంగా ఆర్థికంగా అనుబంధంగా ప్రకృతి పరిశుద్ధంగా అభివృద్ధిని కలిగిస్తూ తరతరాలకు మార్గాన్ని సమాజానికి చూపిస్తూ నీవే ఎదురుచూస్తుంటే నేనే నీకు ఆహ్వానమై వస్తున్నానుగా
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment