Thursday, November 28, 2019

శుద్ధమైనదే పరిశుద్ధమైనదే పరమాత్మ స్వరూపం

శుద్ధమైనదే పరిశుద్ధమైనదే పరమాత్మ స్వరూపం
పూర్ణమైనదే పరిపూర్ణమైనదే పరంధామ స్వభావం

పవిత్రమైనదే పరిశుభ్రమైనదే పరమాత్మ అవతారం
పూజ్యమైనదే పరిపూజ్యమైనదే పరంధామ అఖిలత్వం

శాంతమైనదే ప్రశాంతమైనదే పరమాత్మ దర్శనం
ప్రసిద్ధమైనదే ప్రతిష్టమైనదే పరంధామ దయనీయం

దేహమందు కలవాడే భగవంతుడు దైవమందు గలవాడే భూతాంతరాత్ముడు  || శుద్ధమైనదే ||

ఏ భావంతో ఉదయించినా అంతర్భావమై కాలంతో ఆవిర్భవించేను
ఏ తత్వంతో జన్మించినా అంతరాత్మమై కార్యంతో ఆవిష్కరించేను 

ఏ వేదంతో స్మరించినా అంతర్వేదమై అంతఃప్రకృతిలో ప్రభవించేను
ఏ జ్ఞానంతో కొలిచినా అంతర్జ్ఞానమై అంతఃపురములో ఉద్భవించేను   || శుద్ధమైనదే ||

ఏ సత్యంతో నడిచినా అంతర్లీనమై వేదంతో అవతరించేను
ఏ ధర్మంతో పాటించినా అంతర్లిఖితమై నాదంతో అనుకరించేను

ఏ జీవంతో వెలిసినా అంతర్జీవమై అణువణువునా విశ్వసించేను
ఏ రూపంతో వెలిగినా అంతర్యాణమై పరమాణువునా ఉచ్చ్వాసించేను  || శుద్ధమైనదే ||

No comments:

Post a Comment