Friday, November 8, 2019

విశ్వమంతా నన్ను తిలకించు సమయం ఏనాటిదో

విశ్వమంతా నన్ను తిలకించు సమయం ఏనాటిదో
విశ్వమంతా నన్ను స్మరించు సందర్భం ఏనాటిదో

జగమంతా నన్ను ధ్యానించు సమయాలోచన ఏనాటిదో
జగమంతా నన్ను పరిశోధించు సమయస్ఫూర్తి ఏనాటిదో

విశ్వ భావాల జీవ తత్వాల సుగుణ వేదాలోచన నా మేధస్సులో ఎంతటి విజ్ఞానమో  || విశ్వమంతా ||

విశ్వ జీవుల పరిశోధన (నా మేధస్సులో) ప్రకృతి సిద్ధాంతాల భూత శాస్త్రీయమే
విశ్వ జీవుల అన్వేషణ (నా మేధస్సులో) ప్రకృతి పదార్థాల భూత మిశ్రమమే

విశ్వ జీవుల అనుబంధం (నా మేధస్సులో) ఆకార సౌభాగ్యముల సమయానందమే
విశ్వ జీవుల అనురాగం (నా మేధస్సులో) రూపాంతర వ్యవహారముల సమయకార్యమే  || విశ్వమంతా ||

విశ్వ జీవుల భావ గుణములు (నా మేధస్సులో) జీవన శైలి స్వరూప కార్యాచరణమే
విశ్వ జీవుల తత్వ సత్వములు (నా మేధస్సులో) జీవిత ప్రజ్ఞ స్వశక్తి కార్యాదరణమే

విశ్వ జీవుల ప్రకృతి సిద్ధాంతాలు (నా మేధస్సులో) పర్యావరణ జీవ ధారణ వేద సారాంశమే
విశ్వ జీవుల ప్రకృతి శాస్త్రములు (నా మేధస్సులో) పత్రహరిత జీవ పోషణ జ్ఞాన సంబోధమే  || విశ్వమంతా ||

నా మేధస్సులో గమన చలన భావ తత్వములు అసంఖ్యాక అభిజ్ఞముల ఆద్యంతము
నా మేధస్సులో లోచన యోచన వేద ప్రజ్ఞానములు అనంత అభ్యుదయముల అద్వైత్వము

నా మేధస్సులో విశ్వ స్మరణ యోగ కాలము ప్రకృతి భావాల స్వచ్ఛత సమేత సంపూర్ణ ఆరోగ్యము
నా మేధస్సులో విశ్వ కారణ ధ్యాన కాలము ప్రకృతి తత్వాల స్పష్టత సమీప సంభోగ సౌభాగ్యము   || విశ్వమంతా || 

No comments:

Post a Comment