విశ్వం పలికిన పలుకులనే గమనించెదను
జగం తలచిన తపనములనే స్మరించెదను
లోకం వెతికిన వెలుగులనే పరిశోధించెదను
దైవం అడిగిన అనుభవాలనే అన్వేషించెదను
జ్ఞానం తెలిపిన విధేయతనే సర్వం గౌరవించెదను
వేదం తెలిపిన వినయమునే నిత్యం సమర్థించెదను || విశ్వం ||
జగం తలచిన తపనములనే స్మరించెదను
లోకం వెతికిన వెలుగులనే పరిశోధించెదను
దైవం అడిగిన అనుభవాలనే అన్వేషించెదను
జ్ఞానం తెలిపిన విధేయతనే సర్వం గౌరవించెదను
వేదం తెలిపిన వినయమునే నిత్యం సమర్థించెదను || విశ్వం ||
No comments:
Post a Comment