హృదయాన్నే గమనించవా శ్వాసనే స్మరించవా
మేధస్సునే దేహ క్రియలతో ఏకీభవించవా
మనస్సునే ఏకాగ్రతతో దేహాన్ని ప్రశాంత పరచవా
ఏ ఆత్రత లేకుండా శ్వాసను హృదయానికి హాయిగా ఉచ్చ్వాస నిచ్ఛ్వాసాలతో అందించవా || హృదయాన్నే ||
హృదయ శ్వాసనే స్వధ్యాసతో స్వచ్చంగా జయించవా
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే ధ్యానంతో సర్వం శుద్ధంగా జయించవా
దేహ శాంతతను శ్వాస ప్రక్రియలతో నిత్యం పవిత్రంగా జయించవా
రూప భావాలను జీవ తత్వాలతో సుదీర్ఘంగా జయించవా || హృదయాన్నే ||
మేధస్సులోని పర ధ్యాన యోచననే శ్వాసపై ఏకీభవించవా
మనస్సులోని గమనమే ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై కేంద్రీకరించవా
వయస్సులోని భారాన్ని దేహ క్రియల ప్రశాంతతకై కుదించవా
ఆయుస్సులోని సమయాన్ని స్వదేహ జీవితానికై సాగించవా || హృదయాన్నే ||

No comments:
Post a Comment