Thursday, November 7, 2019

విశ్వ మేధస్సుతో ఆలోచించవా మానవ మూర్తి

విశ్వ మేధస్సుతో ఆలోచించవా ఓ! మానవ మూర్తి
విశ్వ భావాలతో ఆలోచించవా ఓ! మానవ మహాత్మ
విశ్వ తత్వాలతో ఆలోచించవా ఓ! మానవ మహర్షి
విశ్వ కార్యాలతో ఆలోచించవా ఓ! మానవ మనోజ్ఞ

విశ్వ వేదాలు జీవుల మేధస్సులలో పరిశోధనమైన శాస్త్రీయ విజ్ఞాన స్వభావాలు
విశ్వ కార్యాలు జీవుల మేధస్సులలో అన్వేషణమైన ప్రకృతి సిద్ధాంత తత్వాలు  || విశ్వ ||

విశ్వ మేధస్సుతో కలిగే ఆలోచనలు మహోదయమైన పరిశుద్ధ విజ్ఞనాన్ని కలిగించేను 
విశ్వ స్వభావాలతో కలిగే ఆలోచనలు శుభోదయమైన పవిత్రత ప్రజ్ఞానాన్ని కలిగించేను
విశ్వ తత్వాలతో కలిగే ఆలోచనలు నవోదయమైన పత్రహరిత సిద్ధాంతాన్ని కలిగించేను
విశ్వ కార్యాలతో కలిగే ఆలోచనలు సూర్యోదయమైన పర్యావరణ శాస్త్రియాన్ని కలిగించేను

ఆలోచనలను విశ్వ మేధస్సుతో ఏకీభవిస్తే జీవుల కార్య ప్రణాళిక ప్రకృతి సిద్ధాంత శాస్త్రీయమే  || విశ్వ ||

విశ్వ మేధస్సుతో ఆలోచిస్తే నీవు విజ్ఞాన ఆయుస్సుతో సకాలం జీవించెదవు
విశ్వ స్వభావాలతో ఆలోచిస్తే నీవు ప్రజ్ఞాన అభివృద్ధితో సుదీర్ఘం జీవించెదవు
విశ్వ తత్వాలతో ఆలోచిస్తే నీవు వేదాంత అనుభవంతో సురక్షితం జీవించెదవు
విశ్వ కార్యాలతో ఆలోచిస్తే నీవు అభిజ్ఞ అద్వితీయత్వంతో విస్తృతం జీవించెదవు

ఆలోచనలను విశ్వ మేధస్సుతో ఏకీభవిస్తే జీవుల కార్య ప్రణాళిక ప్రకృతి సిద్ధాంత శాస్త్రీయమే  || విశ్వ ||

=====
సమాజ కార్యాలతో ఆలోచించేవాడు మానవుడు
విశ్వ సిద్ధాంతాలతో ఆలోచించేవాడు మాధవుడు

విశ్వ మేధస్సు తెలుపుతుంది ఆరోగ్యమైన జీవితం పగలు కార్య సిద్ధితో రాత్రి కార్య విశ్రమణతో
నేటి జీవితాలు అనారోగ్యమైన సిద్ధాంతాల రాత్రి కార్యాచరణగా పగలు సంకటమైన కార్య విశ్రమణతో 

విశ్వ విజ్ఞాన జీవ ఆరోగ్య జీవన జీవిత సూత్రం:

ఎంతటి విజ్ఞానవంతులైనా విశ్వ మేధస్సుతో ఆలోచిస్తూ ఏ కార్యాచరణ ప్రణాళికనైనా
పగలు శ్రమించుటకై నిర్ణయించండి రాత్రి విరామం కలిగించేలా దయతో ఆచరింపజేయండి

మనిషికి రాత్రి ఉద్యోగం కన్నా పగటి శ్రమతో  (రాత్రి విరామంతో) ఆరోగ్యం మిన్నా

విశ్వ సిద్ధాంతాన్ని అమలుపరిచేవాడు స్వర్గాధిపతి
సమాజ సిద్ధాంతాన్ని అమలుపరిచేవాడు వ్యాపారపతి

ఎంతటి విజ్ఞానం ఐశ్వర్యం ఉన్నా అనారోగ్య జీవితం అకాల మరణం వృధాయే
=====

No comments:

Post a Comment