Tuesday, December 10, 2019

నా మనస్సే ఒక మంత్రం నా వయస్సే ఒక తంత్రం

నా మనస్సే ఒక మంత్రం నా వయస్సే ఒక తంత్రం
నా దేహస్సే ఒక యంత్రం నా మేధస్సే ఒక మర్మం

నా ఆయుస్సే ఒక గాత్రం నా ఉషస్సే ఒక ఆత్రం
నా విధస్సే ఒక యాత్రం నా వచస్సే ఒక చిత్రం

ఎందుకు నా భావన విశ్వాన్ని తాకుతున్నది
ఎందుకు నా తత్వన జగాన్ని అందుకున్నది

ఎందుకు నా వేదన సాగరాన్ని నింపుకున్నది
ఎందుకు నా జ్ఞానన ఆకాశాన్ని కలుపుకున్నది

నాలోని జీవం దైవత్వమేనా నాలోని నాదం పరతత్వమేనా
నాలోని గమనం మాతృత్వమేనా నాలోని చలనం పితృత్వమేనా

పరమాత్మగా జీవించే నా దేహం పరంధామ మేధస్సుకే పరిశోధనమయ్యేనా  || ఎందుకు ||

ఏమిటో నా మేధస్సు మర్మమై విశ్వ భావాలనే తలచేను
ఏమిటో నా దేహస్సు యంత్రమై విశ్వ తత్వాలనే వలచేను

ఏమిటో నా మనస్సు మంత్రమై విశ్వ వేదాలనే పలికించేను 
ఏమిటో నా వయస్సు తంత్రమై విశ్వ జ్ఞానాలనే లిఖించేను

ఎవరికి లేదా నా భావాల గమనం మీరు కోరిన తత్వాల విధానం
ఎవరికి లేదా నా వేదాల చలనం మీరు చూసిన రూపాల ప్రధానం  || ఎందుకు ||

ఏమిటో నా విధస్సు యాత్రమై విశ్వ రూపాలనే దర్శించేను
ఏమిటో నా వచస్సు చిత్రమై విశ్వ బంధాలనే ఆకర్షించేను

ఏమిటో నా ఆయుస్సు గాత్రమై విశ్వ నాదాలనే పరిశీలించేను
ఏమిటో నా ఉషస్సు ఆత్రమై విశ్వ సమయాలనే వీక్షించేను

ఎవరికి లేదా నా బంధాల పరిచయం మీరు నేర్చిన వచనాల వైనం
ఎవరికి లేదా నా కార్యాల పర్యావరణం మీరు చేసిన వాఖ్యాల కథనం  || ఎందుకు || 

No comments:

Post a Comment