Monday, December 2, 2019

ఏనాటి శిలవో నీవు శిలగా శిల్పమై ఆలయమందే స్థిరత్వమై నిలిచావు

ఏనాటి శిలవో నీవు శిలగా శిల్పమై ఆలయమందే స్థిరత్వమై నిలిచావు
ఎంతటి శిలవో నీవు శిలగా ఆకారమై ఆవరణమందే నిశ్చలమై ఒదిగావు

ఎంతటి గుణత్వమో నీ శిల ధార ధరించిన రూప స్వభావం ఆలయమంతా నిండుకున్నది
ఏనాటి స్పందనత్వమో నీ శిల ధార ఆవిష్కరించిన వేదం దేవాలయమంతా నింపుకున్నది   || ఏనాటి ||

ఎవరి శిల్ప కళ చాతుర్యమో తన వేళ్ళ అంచున తడబడుతు ఎదిగిన మహా శిల్ప సౌందర్యం
ఎవరి శిల్ప కల భావనమో తన ఆలోచన శిల్పంలో దాగిన మహోత్తర కళా చిత్ర రూప దృశ్యం

ఎవరి జీవ కల లక్ష్యమో శిలల శిల్ప రూప కల్పనల చరితం అమోఘమైన మనోహర రమ్యం
ఎవరి జీవ కళ గమనమో శిలల చిత్ర రూప కళా వైనం అద్భుతమైన సుందర శుభ ఇతిహాసం  || ఏనాటి ||

ఎంతటి శిల్ప కళ భాగ్యమో అనేకులు తపంచి అమర్చిన అందాల అపురూప స్వరూపం
ఎంతటి చిత్ర కళ బంధమో అసంఖ్యులు తలచి సాధించిన ఆనంద భూషణ శిల్పర్షితం

ఎంతటి కాల కళయో జీవన శైలి లేఖనం రాతి శిల్పాల సౌజన్యం దైవ మూర్తి భంగిమల యోగాసనం   
ఎంతటి కాల కలయో జీవన శైలి వైవిధ్యం రాతి శిల్పాల సోపానం నాట్య మూర్తి రమణీయ విన్యాసం  || ఏనాటి || 

No comments:

Post a Comment