Thursday, December 26, 2019

ఓ దైవమా ఇది నీ ధ్యానమా

ఓ దైవమా ఇది నీ ధ్యానమా
ఓ దేహమా ఇది నీ ధ్యాసమా

ఓ వేదమా ఇది నీ జ్ఞానమా
ఓ రూపమా ఇది నీ నాదమా

జీవులకే నీవు పరిశోధన స్వరూపమా  || ఓ దైవమా ||

ప్రకృతిలోనే ఉదయిస్తూ విశ్వమంతా నిలయమైనావా
ప్రకృతిలోని అస్తమిస్తూ జగమంతా ఆవరణమైనావా

ఆకృతిలోనే జీవమై నిరంతరం సహనత్వమైనావా 
ఆకృతిలోనే రూపమై నిత్యంతరం అధ్యాయమైనావా 

ధ్యానించుటలోనే నీ అమరత్వం మహా దైవమై మేధస్సుకే విజ్ఞానం బోధిస్తున్నది  || ఓ దైవమా ||

జాగృతిలోనే నాదమై స్వరాలతో మనోహరమైనావా
జాగృతిలోనే రాగమై గీతాలతో మాధుర్యమైనావా

వికృతిలోనే గమనమై కాలంతో సుధీర్ఘమైనవా
వికృతిలోనే చలనమై అహంతో స్వర్గీయమైనవా

తిలకించుటలోనే నీ పర్వతం మహా రూపమై దేహస్సుకే వేదాంతం తెలుస్తున్నది   || ఓ దైవమా || 

No comments:

Post a Comment