Thursday, December 12, 2019

జీవితం కఠినత్వమా మేధస్సే మహా కఠినమా

జీవితం కఠినత్వమా మేధస్సే మహా కఠినమా
జీవనం కఠినత్వమా మనస్సే మహా కఠినమా

జీవించుటలో సమయాలోచన లేని మేధస్సే మహా సమస్యత్వమా
జన్మించుటలో సమృద్ధితన లేని దేహస్సే మహా విషాదత్వయమా

మానవ జీవితం తీరని వీడని కఠిన సమస్యల కాల కార్య బంధమా  || జీవితం ||

యోగ్యత లేని విధానం జీవితమై జీవన సమస్యలకు దాసోహమయ్యేనా
భాగ్యత లేని వివాదం జీవనమై జీవిత సంపర్కాలకు అధ్యాయమయ్యేనా

సౌఖ్యత లేని విషాదం అస్థిరమై కాల కార్యాలకు ప్రకంపనమయ్యేనా
నవ్యత లేని విచారం అవస్థమై సమయ భావాలకు పరంపరమయ్యేనా 

ఆలోచన గమనాల లోపమా అనర్థ నియమాల ప్రాబల్యమా అతిశయ తత్వాల వైకల్యమా  || జీవితం ||

భోగ్యత లేని విశేషం ప్రస్థానమై జీవ బంధాలకు వేగిరపాటయ్యేనా
దివ్యత లేని విశ్వాసం ప్రఘాతమై దేహ కార్యాలకు నిర్బంధమయ్యేనా

ప్రాముఖ్యత లేని విలాపం వికృతమై మహా పరీక్షలకు కారణమయ్యేనా
ప్రావీణ్యత లేని వాదనం వితండమై దీక్ష వ్యవహారాలకు తతంగమయ్యేనా 

ఆలోచన గమనాల లోపమా అనర్థ నియమాల ప్రాబల్యమా అతిశయ తత్వాల వైకల్యమా  || జీవితం || 

No comments:

Post a Comment