అక్షరమే అర్థమై పదమే పదార్థమై లిఖించునా వేదం
వాక్యమే వ్యాకరణమై వ్యాసమే వ్యాసార్థమై బోధించునా నాదం
భాషే సంభాషణమై భావమే సంభూషణమై వివరించునా నీ పదకోశం || అక్షరమే ||
పరమార్థమే పరిశోధనమై పర్యాయమే పర్యవేక్షణమై సాధించునా గీతం
వాచకమే పాఠ్యాంశమై చరణమే ఆచరణమై సాగించునా ప్రవచనం
వేదమే వేదాంతమై జ్ఞానమే విజ్ఞానమై ఆశ్రయించునా జీవితం
నాదమే విద్యాంశమై యజ్ఞమే అభిజ్ఞమై అనుసరించునా జీవనం || అక్షరమే ||
భాషా భావమే మన వేదాంశమై జీవించును మన మేధస్సులలో
భాషా తత్వమే మన అర్థాంశమై ధ్యానించును మన మనస్సులలో
భాషే ప్రధానమై మన గమనమై స్మరించును మన వయస్సులలో
భాషే ప్రయోజనమై మన ఉపదేశమై పూరించును మన ఆయుస్సులలో || అక్షరమే ||

No comments:
Post a Comment